Uday Kiran : లవర్ బాయ్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నాడు ఉదయ్ కిరణ్. 2000 సంవత్సరంలో చిత్రం సినిమాతో కెరీర్ ని ప్రారంభించి వరుసగా మొదటి మూడు సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నాడు. కెరీర్ ఆరంభం లోనే వరుస విజయాలు అందుకున్న అతి కొద్దిమంది హీరోలలో ఒకరుగా, హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా కమల్ హాసన్ తరువాత ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న యువ హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు.

ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయిన ఉదయ్ కెరీర్ లో కలుసుకోవాలని సినిమా తరువాత వచ్చిన ‘శ్రీరామ్`, `హోళీ`, `నీ స్నేహం`, `నీ జోడి` చిత్రాలు పరాజయం చెందాయి. దీంతో ఆర్థిక కష్టాలు.. పెళ్లి.. పోషణ.. ఇలాంటి కారణాలతో డిప్రెషన్ లోకి వెళ్లి 2013లో సూసైడ్ చేసుకోవడం తెలుగు సినీ పరిశ్రమని కలచివేసింది. ఈ విషయాలే ఇప్పటికీ ప్రచారంలో ఉన్నా, జూన్ 26 ఉదయకిరణ్ 42వ జయంతి సంధర్బంగా అభిమానులు ఆయనని తలుచుకోవడమే కాక కొన్ని ఆసక్తికర విషయాలు, వీడియో క్లిపులను వైరల్ చేస్తున్నారు.
ఉదయ్ కిరణ్ కెరీర్ అయిపోయిందని అప్పుడే ఫిక్స్ అయ్యా…

ఉదయ్ కిరణ్కి సినిమా అవకాశాలు తగ్గిపోవడానికి, పూర్తిగా ఆగిపోవడానికి మెగాస్టార్ చిరంజీవినే కారణమని అప్పట్లో అనేక రూమర్స్ ఇండస్ట్రీలో వైరల్ అయ్యాయి. చిరంజీవి తన కూతురితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసినందుకు కక్షతోనే ఇలా చేశారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఉదయకిరణ్ జయంతి సంధర్బంగా ఇప్పుడు మరోసారి అప్పటి క్లిప్ వైరల్ కావడం ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది.

ఏ ఎం రత్నం ఉదయకిరణ్ తో రెండు బాషలలో ఒక సినిమా 80 శాతం పూర్తిచేయగా, అప్పటిలో ఆ సినిమా చిరంజీవి, అల్లు అరవింద్ బెదిరించడం వలన ఆగిపోయింది అని, అల్లు అరవింద్ కాకుండా ఇండస్ట్రీలో ఇంకా నలుగురు నిర్మాతలు ఎలా చెబితే అలాగే జరుగుతుంది అని వాళ్ళని కాదని ఏం జరగదని, అపుడే అనుకున్నా ఉదయ్ కిరణ్ కెరీర్ అయిపోయింది అని ఆయన హైదరాబాద్లో ఒక ఫంక్షన్ లో పాల్గొన్నప్పుడు సన్నిహితులతో ఏ ఎం రత్నం చెప్పారట. అప్పట్లో అది వార్త పత్రికలో వచ్చింది. అప్పట్లో వచ్చిన వార్త ఇపుడు సామాజిక మద్యమంలో అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఇపుడు ఉదయ్ కిరణ్ కి సంబంధించిన ఈ వార్త నెట్ లో వైరల్ అవుతోంది.



























