Uma Maheswari : ఎన్టీఆర్ చిన్నకూతురు ఉమా మహేశ్వరి సోమవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని సంచలనం సృష్టించారు. ఆత్మహత్య కు దారితీసిన పరిస్థితులను చాలా మంది విశ్లేషిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో డిప్రెషన్ వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నా, ఇంకా ఎక్కడో అనుమానాలు అసలు నందమూరి కుటుంబంలో ఏం జరుగుతోంది ఇంతమంది తోబుట్టువులు ఉన్న కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఇవాళ అంత్యక్రియలు జరిపిన కుటుంబ సభ్యులు ఇంకా షాక్ లో ఉన్నామంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అసలు ఉమా మహేశ్వరి మరణానికి కారణం ఏమిటి, ఎందుకు జీవితం నుండి రాజీనామా తీసుకుంది అనే అంశాలను సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు విశ్లేషించారు.

ఆ ఘటనలే ఆమె మరణానికి కారణం…
ఎంతమంది ఉన్నా బాధలను, కష్ట సుఖాలను పట్టించుకునే తోడు లేకపోతే ఒంటరితనం తో నరకం అనుభవిస్తాము. చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా అవేవీ సంతోషాన్ని ఇవ్వవు. అలాంటి సమయంలోనే డిప్రెషన్ కి లోనై ఆత్మహత్య ఆలోచనలు చేస్తారు. అలాంటి పరిస్థితులనే ఉమా మహేశ్వరి ఎదుర్కొని ఉండవచ్చని భరద్వాజ అభిప్రాయ పడ్డారు. సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన చివరి రోజుల్లో ఇలాగే ఒంటరితనంతో మానసికంగా బాధపడి మరణించారాని అందరూ అంటారు. అలాగే ఉమా మహేశ్వరి కూడా ఒంటరితనంతో బాధపడి ఉండవచ్చు. ఏ వ్యక్తి అయినా ఆత్మహత్య కు పాల్పడేది సమస్యలు ఉన్నపుడు, లేదా తనకు ప్రాముఖ్యత ఇవ్వని చోట తనకు విలువ లేదని అనిపించినపుడు తనకు చేయాల్సినది ఏం లేదని అనిపించినపుడు ఇలాంటి ఆలోచన చేస్తారని, జీవితం నుండి రాజీనామా తీసుకుని మిగిలిన కుటుంబ సభ్యులకు తన నిరసన తెలియాలని భావిస్తారంటు చెప్పారు. కానీ ఉమా మహేశ్వరి గారు ఇటీవలే కూతురు పెళ్లి ఘనంగా నిర్వహించారు. మొత్తం కుటుంబం అంతా చాలా రోజుల తరువాత కలిసి సంతోషంగా గడిపారు.

కానీ ఆమె బాధలను పంచుకునే వాళ్ళు కనిపించలేదనే నిరాశావాదం ఉండిఉండవచ్చు అంటూ విశ్లేషించారు. ఇక చనిపోయే రోజు కూడా కూతురు అల్లుడిని పిలిపించి మాట్లాడింది, ఆడపడుచు కూడా ఇంట్లోనే ఉంది భర్త మాత్రం వ్యాపార నిమిత్తం చెన్నై లో ఉన్నారు. అందరితో మాట్లాడి వంటలు చేయమని పని మనిషికి కూడా చెప్పిన ఉమా మహేశ్వరి ఇలా ఆత్మహత్యకు పాల్పడటం అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం లాగా అనిపించడం లేదని కావాలనే అందరినీ పిలిచి తానుజీవితం నుండి రాజీనామా తీసుకుంటున్నట్లు చెప్పాలనే అలా చేసారని అయితే తండ్రి ధైర్యం తెగువలో కొంత ఉమా మహేశ్వరి కి ఉంటే ఇలా జరుగుండేది కాదని ఆయన అభిప్రాయ పడ్డారు.

































