Uma Maheswari : సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకుని ఎన్టీఆర్ గారి చిన్న కూతురు ఉమా మహేశ్వరి మరణించారు. అంతవరకు ఆమె గురించి పెద్దగా తెలియని వారు ఇపుడు ఆమె గురించి ఆరా తీస్తున్నారు. ఉమా మహేశ్వరి ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టమైన కుమార్తె. అందరికంటే చిన్న కూతురు కావడంతో ఆమె పట్ల మరింత ప్రేమ ఉండేదట. అలాగే తండ్రి నుండి మొండి, ధైర్యం, పట్టుదల కూడా వారసత్వంగా పునికి పుచ్చుకున్నారు. పెళ్లి తరువాత మొదటి భర్త వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డ మొదట తండ్రితో చెప్పలేదు. భర్త మానసికంగా, శారీరకంగా వేదించడం ఎక్కువ అవడంతో ఇక భరించలేక తోబుట్టువులతోనూ తండ్రి తోనూ చెప్పింది. ఇక రెండో పెళ్లి తరువాత ప్రశాంతంగా బ్రతుకుతున్న ఉమా మహేశ్వరి ఇలా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు.

తండ్రి కోసం ఇంట్లో అందరినీ ఎదిరించిన మహేశ్వరి…
పెళ్ళికి ముందు మొత్తం తండ్రికి సంబంధించిన విషయాలను చూసుకునేవారట ఉమా మహేశ్వరి. రోజూ ఎన్టీఆర్ గారి పనులు, ఎవరిని కలవాలి అన్న విషయాలను మేనేజ్ చేసేవారట. ఆయన ఉదయం రెండు గంటలకే లేస్తే ఉమా మహేశ్వరి కూడా రెండు గంటలకు లేచి ఆయన పనులను చూసుకునేవారట. పెళ్లయ్యాక అమెరికా వెళ్లి కొద్ది రోజులు అక్కడ ఉండిపోయారు. ఎన్టీఆర్ గారు కొడుకులతో సమానంగా కూతుర్లను చూసారు. ఇక చిన్న కూతురు ఉమా మహేశ్వరికి ఆమె పేరున ఒక ఇల్లుని కొనిచ్చారు. ఆ ఇంట్లోనే ఎన్టీఆర్ గారు చనిపోయే వరకు ఉన్నారు. పెళ్ళయ్యాక అమెరికా వెళ్లిన ఉమా మహేశ్వరి తండ్రి చనిపోయాక ఆ ఇంట్లో లక్ష్మి పార్వతి ఉన్నా ఏం అనలేదు.

మిగతా కుటుంబ సభ్యులు అందరూ లక్ష్మి పార్వత్తిని ఆ ఇంటి నుండి ఖాళీ చేయించాలని చూసినా ఉమ మహేశ్వరి ఒప్పుకోలేదు. తన తండ్రికి నచ్చిన వ్యక్తి కాబట్టి ఆ ఇంట్లో ఉండొచ్చని అనుకున్నారట. సోదరులు, బంధువులు ఎంత ఒత్తిడి తెచ్చినా ఆమె వినలేదు. ఇక పవర్ ఆఫ్ పట్టా ఎన్టీఆర్ కుమారులకు మారిన తరువాత లక్ష్మి పార్వతి ఉన్న ఆ ఇంటిని స్వాదినం చేసుకుని అక్కడి నుండి ఆమెను పంపించేశారు. ఉమా మహేశ్వరీ పేరున ఇల్లు ఉన్నంత వరకు లక్ష్మి పార్వతి అక్కడే ఆ ఇంట్లోనే ఉన్నారు. అలా తండ్రికి నచ్చిన వ్యక్తి అని లక్ష్మి పార్వతి పట్ల ఉమా మహేశ్వరి సానుకూలంగా ఉండేవారని సన్నిహితులు చెబుతారు. ఇక తండ్రి లాగే మొండి ధైర్యం, పట్టుదల ఎక్కువని చెబుతారు. ఏదైనా తనకు మంచి అనిపిస్తే ఇంకెవరు చెప్పినా ఉమా మహేశ్వరి వినేది కాదట.


































