బుల్లితెరపై బిగ్ బాస్ 5 ఎంతో రసవత్తరంగా కొనసాగుతూ రెండు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొదటి వారం సరియు హౌస్ నుంచి బయటకు రాగా రెండవ వారం ఉమాదేవి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ఉమాదేవి బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉమాదేవి హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొన్న ఉమాదేవి.. సిరి, షణ్ముఖ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏంటి..? అంటూ వారి గురించి కామెంట్ చేయగా అనీ మాస్టర్ గురించి ఎంతో కన్నింగ్ గా గేమ్ ఆడుతోందని తెలియజేశారు.ఇక యాంకర్ రవి గురించి మాట్లాడుతూ తనతో బాగా గొడవ పడదామని నిర్ణయించుకున్నప్పటికీ తన ఏమాత్రం అవకాశం ఇవ్వలేదని తెలిపింది.
ఇక సిరి ఉంటే పక్కన కచ్చితంగా షన్ను ఉండాల్సిందే.. అదేవిధంగా షణ్ముఖ్ ను ఉద్దేశించి ఈ అబ్బాయి కనుక సిరి మాటలు వింటే మాత్రం.. ఖచ్చితంగా హౌస్ నుంచి కొద్దిరోజులలో ఎలిమినేట్ అవుతాడని… సిరి చెప్పిన మాటలు కారణంగా ఇతను హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఉమాదేవి షణ్ముఖ్ జస్వంత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
షణ్ముఖ్ సిరితో కాకుండా తన గేమ్ తను ఆడితే తను ఎక్కువ రోజులు హౌస్ లో ఉంటాడని.. సిరి మాటలు వింటే మాత్రం కచ్చితంగా బయటకు వస్తాడు అంటూ తెలియజేసింది. ఉమాదేవి హౌస్ లో ఉన్నన్ని రోజులు బూతులు మాట్లాడుతూ టాస్క్ లలో పాల్గొని అందరినీ నవ్విస్తూ… లోబోతో ప్రేమ వ్యవహారం జరిపిన తనను ఎలిమినేషన్ నుంచి కాపాడలేకపోయాయని చెప్పవచ్చు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…