Un stoppable season 2 : బాలయ్య అనగానే అన్ స్టాపబుల్ ముందు వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క. ఆయన ఇమేజ్ మొత్తం ఆ ఒక్క షోతో మారిపోయింది. ఏంటి బాలయ్య ఇలా ఉంటాడా, ఇంత సరదాగా మాట్లాడుతాడా, ఇంత కామెడీ చేస్తాడా అనేలా ఆకట్టుకున్నాడు. అప్పటివరకు బాలకృష్ణ అంటే కోపంగా ఉంటాడు, దురుసుగా ప్రవర్తిస్తారు అనే అభిప్రాయం ఉండేది అది మొత్తం అన్ స్టాపబుల్ తో పోయింది. ఆయన ఫన్, ఎనర్జీ, పంచ్ లకు అన్ స్టాపబుల్ అనేలా ఉంది షో. మొదటి సీజన్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఒకరకంగా ఆహా కి చందాదారులు పెరగడానికి కారణం అన్ స్టాపబుల్ షో అని చెప్పాలి. మంచి రేటింగ్స్ తో దుసుకుపోతున్న ఈ షో విజయానికి తెర ముందు బాలయ్య ఎనర్జీ ఎంత కారణమో తెరవెనుక అన్ స్టాపబుల్ టీం కృషి కారణం.

బాలకృష్ణ సక్సెస్ కి చిన్న కూతురే కారణం…
బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ వన్ కి పనిచేసిన మచ్చా రవి షో సక్సెస్ లో బాలకృష్ణ కూతురు తేజస్విని గారి పాత్ర చాలా ఉందని తెలిపారు. ఆయన లుక్ విషయంలో, స్టైల్ విషయంలో తేజస్విని గారు చాలా శ్రద్ధ తీసుకున్నారట. ఇక సీజన్ 1 పెద్ద హిట్ అయ్యాక సీజన్ 2 విషయంలో కూడా తేజస్విని గారు తండ్రి లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట.

తాజాగా విడుదల అయిన అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ మేకింగ్ వీడియో ఆహా వాళ్ళు విడుదల చేసారు. ఇక ఈ వీడియోలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, పక్కన తేజస్విని షాట్ ను పరిశీలిస్తున్న విజువల్స్ కనిపిస్తాయి. ఇక రెండో సీజన్ విషయంలో మరింత కేర్ తీసుకుని బాలయ్య లుక్ మరింత మెరుగుపరిచేందుకు కష్ట పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ షో కోసం తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్ గా పనిచేస్తోంది. ఇక మొదటి ఎపిసోడ్ కి తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు, అల్లుడు లోకేష్ వచ్చారు. శుక్రవారం ప్రసారమైన ఈ ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.































