Undavalli Arun Kumar : అత్యంత హేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగి ఏళ్ళు గడుస్తున్నా ఏపీ కి రావాల్సిన ఆస్తులు, నిధుల విషయంలో ఇంకా క్లారిటీ లేదు. రాజధాని సరిగా లేక ఆస్తులు లేక ఏపీ నాశనమై పోతుంటే ఒకవైపు ప్రభుత్వం కేంద్రంతో పోరాడి ఏపీకి రావలసిన వాటాల విషయంలో కూడా వెనకడుగు వేస్తోంది. ఇక విభజన హామీల అమలు కోసం పోరాడుతాం, ప్రత్యేక హోదాను కేంద్రం మెడలు వంచి సాధిస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇపుడవన్నీ తూచ్ అన్నట్లుగా ఏకంగా సుప్రీం కోర్ట్ లో విభజన విషయం ఇక వదిలేయండని అఫిడవిట్ దాఖలు చేయడం పట్ల ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్పందించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర ప్రయోజనాల కోసమా పోరాడితే బాగుంటుందంటూ మాట్లాడారు.

స్వప్రయోజనాల కోసం రాష్ట్రం ను అన్యాయం చేయకండి….
ఉండవల్లి గారు మాట్లాడుతూ విభజన కేసులో కేంద్రం ఇప్పటివరకు సుప్రీం కోర్ట్ లో కౌంటర్ దాఖలు చేయలేదంటూ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మనకు జరిగిన నష్టాన్ని అఫిడవిట్ గా చేసి సుప్రీం కోర్ట్ లో సబ్మిట్ చేస్తే బాగుంటుంది అలా కాకుండా కేంద్రంలో ఉన్నవారితో స్నేహం ఉన్న కారణంగా పట్టించుకోకపోతే మనకు రావాల్సిన హక్కులను కోల్పోతాం అంటూ చెప్పారు. తెలంగాణ నుండి మనకు రావాల్సిన ఆస్తులు ఇప్పటికీ రాలేదు. ఊరికే ఇచ్చేస్తారా కొట్లాడాలి, పోరాడాలి అప్పుడే సాధించుకుంటాం.పోరాటం చేసాడు చేస్తాడనే నమ్మకం తోనే జగన్ ను జనాలు సీఎం ను చేసారు. ఇప్పుడు పోరాడకుండా మిగిలిపోతే రాజకీయా భవిష్యత్ ఉండదు నీకు జగన్ అంటూ అభిప్రాయపడ్డారు ఉండవల్లి అరుణ్ కుమార్. 2012, జనవరి 30న ఏం జరిగిందో తన వద్ద పూర్తి సమాచారం ఉందంటూ అరుణ్ కుమార్ తెలిపారు.

రాజ్యాంగంలోని 100వ ఆర్టికల్ ను పట్టించుకోకుండా ఆనాడు స్వార్థ ప్రయోజనక కోసం రాష్ట్ర విభజనచేసారంటూ చెప్పారు. ఇంత కాలం అన్యాయంగా జరిగిన రాష్ట్ర విభజన గురించి సుప్రీం కోర్టులో మాట్లాడే అవకాశం వచ్చిందన్నారు. కేసు విచారించాలా లేదా అనే అంశం మీద ముందుగా ప్రభుత్వం కౌంటర్ వేయాలని కోర్ట్ తెలిపిందంటూ ఉండవల్లి వివరించారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం వదిలేయమంటూ అఫిడవిట్ వేయటం పైన అసహనం వ్యక్తం చేసారు.






























