Undavalli Sridevi husband Dr. Sridhar : మాది లవ్ మ్యారేజ్… క్రాస్ ఓటింగ్ చేయలేదు… నచ్చక పోతే తల నరికేస్తారా… ఉండవల్లి శ్రీదేవి భర్త ఫైర్…!

0
558

Undavalli Sridevi husband Dr. Sridhar : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నది ఉండవల్లి శ్రీదేవి సస్పెన్షన్ గురించి. ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సి ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కు ఆమె పాల్పడినట్లు వైసీపీ అధినేతకు అనుమానం రావడంతో ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసారు. ఇక ఆమె గురించి వైసీపీ చోటా మోటా నాయకుల నుండి పార్టీ నేతలు ఉండవళ్ళి శ్రీదేవిని బాగా విమర్శిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే దారుణంగా వైసీపీ సానుభూతి పరుల కామెంట్స్ ఉంటున్నాయి. ఇక ఈ ఇష్యూ పై శ్రీదేవి గారి భర్త డాక్టర్ శ్రీధర్ గారు స్పందించారు. మహిళ అని కూడా లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు.

శ్రీదేవికి అలాంటి పని చేయాల్సిన అవసరం లేదు…

ఉండవల్లి శ్రీదేవి గారు క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారనే ఆరోపణల మీద వైసీపీ పార్టీ ఆమెను సస్పెండ్ చెయడంతో ఆమె కుటుంబం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆమె క్రాస్ ఓటింగ్ కి పాల్పడలేదని, 15 కోట్లు తీసుకుని క్రాస్ ఓటింగ్ టీడీపీ కి అనుకూలంగా ఓటు వేసిందనేది అవాస్తవం అంటూ ఆమె భర్త డాక్టర్ శ్రీధర్ గారు మాట్లాడారు. రాజకీయాలే మాకు జీవితం కాదు, మేము బాగా స్థిరపడిన కుటుంబం అందునా డాక్టర్స్ కావడం వల్ల పని కూడా ఉంది కానీ రాజకీయాల్లోకి వచ్చాక ఇలా బురద జల్లుతారని అనుకోలేదు. ఏమాత్రం రాజకీయ అనుభభం లేని నా భార్యను ఏరికోరి రాజాకీయాల్లోకి ఆహ్వానించి ఇలా ఇప్పుడు నిరాధార ఆరోపణలను నమ్మి సస్పెండ్ చెయడం ఏం బాగోలేదంటూ శ్రీధర్ గారు అభిప్రాయపడ్డారు.

శ్రీధర్ గారు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాగా శ్రీదేవి గారు దళిత సామాజిక వర్గాని చెందినవారు. వైద్య విద్య అప్పుడే ఇద్దరూ ప్రేమించుకున్నారట. తానే క్రాస్ ఓటింగ్ కి పాల్పడిందనే విషయాలను రుజువు చేయడాని ఎటువంటి మెకానిజం వాళ్ళ దగ్గగర లేకపోయినా తానే చేసిందంటూ ఆరోపిస్తూ సస్పెండ్ చేసారు. మీకు నచ్చక పోతే తల నరికేస్తారా.. విచారణ జరపరా అసలు ఎవరు క్రాస్ ఓటింగ్ కి పాల్పడింది అని, ఇదేనా ఒక దళిత మహిళకు మీ పార్టీలో ఇచ్చే గౌరవమంటూ శ్రీధర్ గారు ఫైర్ అయ్యారు.