లోబో అంటేనే అందరికీ టక్కున అతని వేషధారణ గుర్తుకొస్తుంది. విచిత్రమైన వేషధారణలో అందరినీ సందడి చేస్తూ ప్రేక్షకుల మదిలో బాగా గుర్తుండిపోతారు. కెరియర్ మొదట్లో యాంకర్ గా పరిచయమైన లోబో ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఈయన పేరును మాత్రం ప్రేక్షకులు మర్చిపోలేదు. యాంకర్ గా ప్రేక్షకులను సందడి చేసిన లోబో ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ ఫైవ్ ఎంట్రీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే బిగ్ బిగ్‌బాస్ లోకి అడుగుపెట్టిన లోబో గురించి నెటిజన్లు పెద్దఎత్తున సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. లోబో ఎవరు.. ఏంటి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.. లోబోగా అందరికీ పరిచయమైన ఇతని అసలు పేరు మహమ్మద్ ఖయ్యూం. ఇతను పక్క హైదరాబాద్ వాసి. ప్రస్తుతం ఇతని వయస్సు 39 సంవత్సరాలు. 8వ తరగతి వరకు చదువుకున్న లోబో తొమ్మిదవ తరగతి చదువుతున్న సమయంలో స్కూల్లో ఏదో దొంగతనం కారణంగా తనకి టీసి ఇచ్చి పంపించారు.
ఈ విధంగా పైచదువులకు నోచుకోని లోబో హీరోయిన్ కాజోల్ అంటే ఎంతో ఇష్టం ఉండేది. అయితే ఆమెను కలవడం కోసం ఇంట్లో కొంత డబ్బును దొంగలించి ముంబైకి వెళ్ళాడు. అలా ముంబైకి వెళ్లిన లోబో హీరోయిన్ కాజోల్ ను కలవకపోగా తన వెంట తీసుకెళ్లిన డబ్బులు మొత్తం అయిపోయాయి. ఈ క్రమంలోనే ఎన్నో కష్టాలను అనుభవించిన అతను ముంబై నుంచి కొందరి సహాయంతో గోవా చేరుకున్నారు.
ఈ విధంగా గోవాలో టాటూ వేయడం నేర్చుకున్న లోబో తిరిగి హైదరాబాద్ చేరుకొని టాటూ బిజినెస్ పెట్టారు. ఇలా టాటూ వేసే సమయంలో ఒక రష్యన్ యువతి ఇతను వేసిన టాటూ బాగా నచ్చడంతో అప్పటివరకు మహమ్మద్ ఖయ్యూంగా కొనసాగుతున్న అతనికి రష్యన్ యువతి ఎంతో ముద్దుగా లోబో అనే పేరును పెట్టింది. అయితే ఆ పేరు తనకి నచ్చడంతో అప్పటి నుంచి లోబోగానే కొనసాగుతున్నారు. లోబో పేరు ద్వారా యాంకర్ గా పరిచయమైన ఇతను ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి లోబో బిగ్‌బాస్ హౌస్ ద్వారా ఎలాంటి పాపులారిటీని దక్కించుకుంటారో వేచి చూడాలి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…