Unstoppable: బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడంతో ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటు సినీ అభిమానులు రాజకీయ నాయకుల సైతం ఈ ఎపిసోడ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారని విషయం పై ఆసక్తి నెలకొంది.
అయితే ఇదివరకు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటే బాలకృష్ణ తన పెళ్లిళ్లు గురించి ఏమాత్రం ప్రస్తావనకు తీసుకురాకూడదని వార్తలు వచ్చాయి. కానీ బాలయ్య మాత్రం ఈ షోలో తన మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావనకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లిళ్లు ఏంటయ్యా అని బాలయ్య ప్రశ్నించడంతో ఇప్పటివరకు ఎక్కడ బయట పెట్టని పవన్ కళ్యాణ్ తన మూడు పెళ్లిళ్ల గురించి ఈ కార్యక్రమంలో చాలా క్లియర్ గా చెప్పినట్టు తెలుస్తోంది.
ఇలా తన మూడు పెళ్లిళ్ల గురించి క్లియర్గా చెప్పడంతో బాలకృష్ణ సైతం ఇది విన్న తర్వాత కూడా ఎవరైనా నీ మూడు పెళ్లిళ్లు గురించి మాట్లాడితే వాళ్ళు ఊర కుక్కలతో సమానమని ఘాటుగా స్పందించారని సమాచారం.అయితే వైసిపి నేతలు ఎప్పుడు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ను తన మూడు పెళ్లిళ్ల గురించి టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కు ఫోన్ కాల్ ద్వారా మాట్లాడినట్టు సమాచారం. అదే విధంగా ఈ షోలో పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఎపిసోడ్ కోసం అటు సినీ అభిమానులు ఇటు రాజకీయ నాయకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా ప్రసారం కానున్నట్టు సమాచారం.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…