Upasana: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు పొందిన రామ్ చరణ్ ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ప్రస్తుతం ఉపాసన గర్భంతో ఉంది. తొందర్లోనే ఉపాసన మెగా కుటుంబానికి వారసుడిని ఇవ్వబోతోంది. ఉపాసన రామ్ చరణ్ వివాహం జరిగే ఇప్పటికే 11 సంవత్సరాలు పూర్తి అయింది.

2012 జూన్ 14వ తేదీన రామ్ చరణ్ ఉపాసన వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఇలా 11 ఏళ్ల వీరి వైవాహిక జీవితం ఎంతో అందంగా ఆనందంగా సాగిపోయింది. ఇద్దరూ కూడా ఒకరికొకరు తోడుగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరి వివాహం జరిగే 11 ఏళ్ల అయిన సందర్భంగా ఉపాసన తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది.
ఈ క్రమంలో రాంచరణ్ తో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ..” ఈ 11 సంవత్సరాలు చాలా అద్భుతమైన క్షణాలు” అంటూ పోస్ట్ షేర్ చేసింది. ఈ క్రమంలో రామ్ చరణ్ ఉపాసన పెళ్లిరోజు సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉపాసన ఎనిమిది నెలల గర్భంతో ఉంది. మరొక నెల రోజులలో మెగా కుటుంబానికి వారసుడు రాబోతున్నాడు.

Upasana: వారసుడు రాక కోసం ఎదురు చూపు…
ఈ క్రమంలో మెగా కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు కూడా వారసుడు కోసం ఎంతో అద్భుతంగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ కూడా సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి ఇంటిపట్టునే ఉంటూ ఉపాసన బాగోగులు చూసుకుంటున్నాడు. ఇక ఉపాసన డెలివరీ అయిన తర్వాత రామ్ చరణ్ మళ్ళీ షూటింగ్లో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడు.
It’s been an awesome 11 years ❤️@AlwaysRamCharan pic.twitter.com/6Y7d7vfwvB
— Upasana Konidela (@upasanakonidela) June 14, 2023



























