Upasana: ఉపాసన కామినేని పరిచయం అవసరం లేని పేరు ఉపాసన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వివాహం చేసుకొని కొనిదెల ఇంటి కోడలుగా అడుగుపెట్టారు. ఇలా మెగా కోడలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన బిజినెస్ ఉమెన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా రాంచరణ్ ఉపాసన దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలిచారని చెప్పాలి.

ఇకపోతే వీరిద్దరూ వివాహం చేసుకొని పది సంవత్సరాలు పూర్తి అయింది. ఈ క్రమంలోనే ఈ దంపతులు పది సంవత్సరాలకు తల్లిదండ్రులు కాబోతున్నారని శుభవార్త అభిమానులను ఎంతో సంతోషానికి గురి చేసింది ఇక బుల్లి మెగా వారసుడు కోసం ఒకవైపు కుటుంబ సభ్యులతో పాటు మరొకవైపు అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే ఇటీవల ఒక మీడియా ఛానల్ తో ముచ్చటించిన ఉపాసన తన గురించి వస్తున్నటువంటి విమర్శలపై స్పందించారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ రామ్ చరణ్ తనకు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమయ్యారని తెలిపారు. ఇలా ఏర్పడిన మా పరిచయం స్నేహంగా మారి ఆ స్నేహం ప్రేమగా మారిందని తెలిపారు.ఇక మా రెండు కుటుంబాలు విభిన్న నేపథ్యాలు అయినప్పటికీ ఒకరిపై ఒకరికి ఉన్నటువంటి నమ్మకం గౌరవంతో మా పెళ్లి జరిగిందని తెలిపారు.

Upasana:అందంగా లేను అన్నారు..
ఇక పెళ్లి సమయంలో నేను కాస్త లావుగా ఉండడంతో పెద్ద ఎత్తున తనని బాడీ షేమింగ్ ట్రోల్స్ చేశారని ఆవేదన చెందారు. తాను లావుగా ఉన్నానని అందంగా లేనని కామెంట్ చేశారు ఇక మరికొందరైతే ఏకంగా చరణ్ నన్ను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నారు అంటూ విమర్శలు చేశారని ఈమె తెలియజేశారు.అయితే ఆ విమర్శలను పట్టించుకోని తాను బాధపడలేదని ధైర్యంతో ముందడుగు వేసానని తెలిపారు. అయితే అప్పుడు విమర్శించిన వాళ్ళే ఇప్పుడు తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు అంటూ ఈ సందర్భంగా ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.





























