Upasana Kamineni : మెగా ఇంటి కోడలు, అపోలో హాస్పిటల్స్ సిఎస్ఆర్ అయిన ఉపాసన కామినేని రీసెంట్ గా ఒక బిడ్డకు జన్మనదించారు. రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ పెళ్ళైన పదకొండు ఏళ్లకు ఒక అడపాపకు జన్మనివ్వగా, ఉపాసన గర్భం దాల్చినప్పటి నుండి పాప పుట్టి, పేరు పెట్టే ప్రతి విషయం గురించి తమ అభిమానులతో పంచుకుంటూ మురిసిపోయారు ఈ జంట. తల్లిగా తన బిడ్డతో సమయం గడిపిన ఉపాసన ఇప్పుడిప్పుడే మళ్ళీ అపోలో హాస్పిటల్స్ లో బాధ్యతలను చూసుకుంటున్నారు. తాజాగా అపోలో హాస్పిటల్స్ లో అపోలో చిల్డ్రన్స్ బ్రాండ్ ను సోమవారం ఆవిష్కరించిన ఆమె తల్లిగా సాటి తల్లుల కోసం అలోచించి మరో సారి తన గొప్పతనం చాటుకున్నారు.

సింగల్ మదర్స్ కోసం బెనిఫిట్స్…
అపోలో చిల్డ్రన్స్ విభాగాన్ని ఆవిష్కరించిన ఉపాసన తన మాతృత్వపు అనుభూతులను మీడియాతో పంచుకున్నారు. అలాగే పిల్లలను పెంచడం వంటి వాటి గురించి మాట్లాడారు. పిల్లల్లను పెంచేటపుడు తల్లిదండ్రులు గొప్ప అనుభూతిని పొందుతారని, అది చాలా మంది తల్లులలో తను ఇదివరకు చూసేదాన్ని అంటూ కానీ పిలల్లు కొంచం అనారోగ్యానికి గురైనా చాలా బాధపడుతామని, కంగారుపడతామని ఈ విషయం తాను తల్లయ్యాక తెలుసుకున్నాను అంటూ చెప్పారు.

అయితే తన బిడ్డను చూసుకోడానికి తాను మాత్రమే కాకుండా ప్రేమించే భర్త కూడా ఉండటం అదృష్టమని చెప్తూ, కానీ అలా లేని సింగల్ మదర్స్ గురించి ఆలోచించినపుడు బాధగా అనిపించిందని తెలిపారు. అందుకే సింగల్ మదర్స్ కి కొంతైనా సహాయం చేయాలని వారికి అండగా ఉండాలని అపోలో చిల్డ్రన్స్ విభాగంలో వారాంతాల్లో సింగల్ మదర్స్ తమ పిల్లలకు ఉచితంగా వైద్య సేవల కాన్సెల్టేన్సీ (ఓపిడి) పొందవచ్చని తెలిపారు. ఈ సహాయం వారికి ఖచ్చితంగా ఉపయోగాపడుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఇక తాను గర్భం దాల్చినప్పటి నుండి తన మీద అందరూ చూపిస్తున్న అభిమానానికి, బ్లెసింగ్స్ కి ధన్యవాదములు తెలిపారు.