Upasana Kamineni : మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ భార్య అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి మనవరాలు అపోలో సీఈఓ అయిన ఉపాసన కామినేని పుట్టినరోజు కావడంతో అటు సెలబ్రిటీలు ఇటు మెగా అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే కోడలికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి. అసలే ఈ మధ్య మెగా కోడలు ఉపాసన సద్గురు మధ్య జరిగిన చర్చ ద్వారా బాగా వైరల్ అయింది.

మా ఇంటి కోడలు పిల్ల…
ఉపాసన పిల్లలను కనడానికి సుముఖంగా లేదు అన్నట్లు గా సద్గురు వాసుదేవ్ వద్ద చర్చలో అనిపించడంతో మెగా అభిమానులకు కోపం వచ్చింది. ఎప్పుడెపుడు మెగా వారసుడిని చూడాలా అనుకుంటున్న వారికి ఈ విషయం రుచించలేదు. దీంతో ఉపాసన మీద కొంత కోపాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా చూపించారు. అయితే ఇక ఈ విషయంలో మెగాస్టార్ కానీ ఆయన భార్య సురేఖ కానీ, ఇక రామ్ చరణ్ కానీ ఏ మాత్రం స్పందించలేదు. అయితే ఇవాళ ఆమె పుట్టినరోజు నాడు చిరు పెట్టిన పోస్ట్ అందరినీ ఆకర్షించింది.

మా ఇంటి కోడలు పిల్ల @upasanakonidela కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ???????? pic.twitter.com/Wh7ApkxRYy
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 20, 2022
To my Dearest @upasanakonidela Happiest Birthday ❤️ pic.twitter.com/IV58uWQqwF
— Ram Charan (@AlwaysRamCharan) July 20, 2022
మా ఇంటికి కోడలు పిల్ల ఉపాసనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చిరు, సురేఖ, రమా చరణ్, ఉపాసన నవ్వులు చిందిస్తూ ఉన్న పిక్ ను షేర్ చేసారు. ఇక రామ్ చరణ్ కూడా తన శ్రీమతికి నా ప్రియమైన ఉపాసన పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టారు. ఇక చాలా మంది సెలబ్రిటీలు కూడా ఉపాసనకు విషెష్ అందిస్తున్నారు. అయితే మెగాస్టార్ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.































