Uppal Balu & Swathi Naidu: సోషల్ మీడియాలో ఎవరు ఎలా పాపులర్ అవుతారో తెలీదు. ఇక కరోనా మొదటి లాక్ డౌన్ సమయంలో టిక్ టాక్ బాగా ఫేమస్. టిక్ టాక్ వల్ల చాలా మంది ఫేమస్ అయి ఆ తరువాత బుల్లితెర పై కూడా సందడి చేసారు. ఇక టిక్ టాక్ బ్యాన్ అయ్యాక యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ రీల్స్ వంటివి వచ్చాక మళ్ళీ మొదలెట్టేసారు. ఇలా టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన వాళ్లలో ఉప్పల్ బాలు, దుర్గారావు వంటి వారు బుల్లి తెర పై కూడా సందడి చేసారు.

అశ్లీల, ప్రాంక్ వీడియోలను తొలగించండి…..
ఉప్పల్ బాలు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయి జబర్దస్త్ లో కూడా మెరిసాడు. ఇక స్వాతి నాయుడు అనే యువతీ కూడా ఇలా టిక్ టాక్ ద్వారా బాగానే గుర్తింపు తెచ్చుకుంది. వీళ్లిదరు ఇటీవల కలిసి అశ్లీల, ప్రాంక్ వీడియోలను చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని వీటిని చూసి పిల్లలు చెడిపోతున్నారని హైదరాబాద్ కి చెందిన సతీష్ అనే యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
వీరినే కాకుండా ప్రాంక్ వీడియోలు చేసే దివ్య శ్రీకాంత్ రెడ్డి లాంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. పేస్ బుక్, యూ ట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వారు ఆశీల్లతను ప్రమోట్ చేస్తున్నారని ఇలాంటి వాటి వల్ల చిన్నపిల్లలు, యువత పై దుష్ప్రభావాలు పడుతాయాని అతను వెల్లడించారు. ఉప్పల్ బాలు, స్వాతి నాయుడు పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సైబరక్రైమ్ పోలీసులు.



























