Uppena film director Bucchibabu : లెక్కల మాస్టర్ సుకుమార్ గారి శిష్యుడు ఆయన డైరెక్టర్ అయ్యారని స్టూడెంట్ బుచ్చిబాబు కూడా డైరెక్టర్ అయిపోయాడు. అయితే ఇంట్లో వాళ్ళు మొదట్లో ఒప్పుకోక పోతే ఎంబిఏ చదువుకుంటానని హైదరాబాద్ వచ్చి అక్కడ సుకుమార్ గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు బుచ్చిబాబు. ఆయన 100 % లవ్ సినిమా తీసే సమయానికి అసిస్టెంట్ గా ఉన్న బుచ్చిబాబు సుకుమార్ గారి రంగస్థలం సినిమా టైం కి ఉప్పెన కథ రాసుకున్నారట. అలా మొదలయిన ఉప్పెన కథ నేడు జాతీయ ఉత్తమ ప్రాంతీయ ఫిల్మ్ కేటగిరి లో అవార్డులు అందుకుంది. ఇక ఆ సినిమా విశేషాలను డైరెక్టర్ బుచ్చిబాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.

క్లైమాక్స్ సీన్స్ కి టెన్షన్ పడ్డాను….
సినిమా మొత్తం షూటింగ్ ఒకేత్తయితే సినిమా క్లైమాక్స్ సీన్స్ తీసేటప్పటికి బాగా టెన్షన్ పడ్డాను అంటూ డైరెక్టర్ బుచ్చిబాబు తెలిపారు. ఏదైనా సినిమాలో డైలాగులు బాగుంటేనే జనాలకు టచ్ అవుతుందని బలంగా నేను నమ్ముతాను అందుకే సినిమా క్లైమేక్స్ లో కృతిశెట్టి, విజయ్ సేతుపతి మధ్య సాగే సంభాషణ బాగా రావాలని అనుకున్నాను. అందుకే బాగా టెన్షన్ పడటం వల్ల రెండు రోజుల లో తీయాలనుకుని ఫిక్స్ అయితే ఒకరోజంతా ఏమి చేయకుండా అలానే ఉండిపోయాను. ఎం చేయాలో తెలియలేదు. మరోవైపు విజయ్ సేతుపతి గారి డేట్స్ రెండు రోజులే ఉన్నాయి.

కృతి కొత్త అమ్మాయి చెప్పి చేయించుకోవాలి తాను సరిగా చేయనప్పుడు కోప్పడ్డాను. వెంటనే విజయ్ సేతుపతి గారు వచ్చి ఎందుకు టెన్షన్ పడుతున్నావ్. ఇంకో రోజు టైం తీసుకుని సరిగా చేయి, నేను ఇంకో రోజు డేట్ ఇస్తాను ఆ అమ్మాయిని ఎందుకు కోప్పడుతున్నావ్ కొత్తగా సినిమా చేస్తోంది అంటూ చెప్పాక రిలాక్స్ అయి షూటింగ్ చేసాను. రెండు రోజులు అసలు ఫుడ్ కూడ తినలేదు అంటూ ఉప్పెన సినిమా విశేషాలను బుచ్చిబాబు పంచుకున్నారు.