Uppena film director Bucchibabu : వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ఇద్దరు కలిసి తొలిసారిగా నటించిన సినిమా ఉప్పెన. మొదట లాక్ డౌన్ లో విడుదల అయిన ఈ సినిమాలోని పాట సినిమా మీద అంచనాలను పెంచేసింది. ఇక ఆ సినిమా ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డులలో ప్రాంతీయ భాష విభాగంలో అవార్డు సొంతం చేసుకుంది. ఈ సందర్బంగా సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సినిమా గురించి పలు విశేషాలను పంచుకున్నారు.

చిరంజీవి గారు అపుడే చెప్పారు అవార్డు గురించి….
సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు తొలిసారి డైరెక్షన్ చేసిన సినిమా ఉప్పెన. సినిమా రొటీన్ గా వచ్చే తెలుగు సినిమాల కాకుండా క్లైమాక్స్ కథ అనుగుణంగా సాగుతుంది. హీరో ఇమేజ్ ను దృష్టి లో పెట్టుకోకుండా కథకు ప్రముఖ్యం ఇచ్చి సినిమా డైరెక్షన్ చేసాడు బుచ్చిబాబు. ఇక సినిమాలో మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్ ను హీరోగా తీసుకుని మంచి సినిమా ను వైష్ణవ్ కి ఇచ్చాడు.

సినిమా క్లైమేక్స్ గురించి మెగాస్టార్ చిరంజీవి గారికి వివరించినపుడు ఆయన ఇంప్రెస్ అయ్యారంటు బుచ్చిబాబు తెలిపారు. సినిమాలో హీరో ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయడం చివర్లో తండ్రి వద్ద కృతి శెట్టి సంభాషణ గురించి విన్నాక చిరంజీవి గారు అపుడే చెప్పారు, ఈ సినిమాకు జాతీయ అవార్డు వస్తుంది చూడు అని అలాగే నేడు అవార్డు వచ్చింది అంటూ చెప్పారు. ఇక సినిమా కథ రాసుకున్నపుడే విజయ్ సేతుపతి గారిని విలన్ క్యారెక్టర్ లో తీసుకోవాలని డిసైడ్ అయినట్లు చెప్పారు బుచ్చిబాబు.