అగ్రరాజ్యం అమెరికాలో ఓ బంగారు నాణెన్ని వేలానికి వేశారు. అయితే వేలంపాటలోఈ నాణెం రికార్డు స్థాయిలో అమ్ముడు పోవడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మంగళవారం న్యూయార్క్ నగరంలో జరిగిన సోథేబై వేలంలో 1933 నాటి డబుల్ ఈగిల్ బంగారు నాణేన్ని వేలానికి వేయగా.. ఈ నాణేన్ని 18.9 మిలియన్ డాలర్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత భారతీయ కరెన్సీ ప్రకారం ఈ నాణెం విలువ ఏకంగా రూ.142 కోట్ల రూపాయలు.
ఈ విధంగా ఈ డబుల్ ఈగిల్ బంగారు నాణెం మాత్రమే కాకుండా, ఈ వేలం పాటలో ప్రపంచంలోనే అరుదైన ఒక స్టాంపు కూడా8.3 డాలర్లు అనగా 61 కోట్ల రూపాయలకి అమ్ముడుపోవడం ఎంతో విశేషం అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ డబుల్ ఈగిల్ బంగారు నాణెం వేలంపాటలో సుమారుగా 15 మిలియన్ డాలర్ల వరకు పోతుందని వేలం నిర్వాహకులు భావించగా వారి అంచనాలకు అందకుండా ఏకంగ ఈ నాణెం 19 మిలియన్ డాలర్లు పోవడంతో వారు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం వేలంపాటలో అరుదైన స్థాయిలో అమ్ముడుపోయిన ఈ నాణెం ఒక వైపు అమెరికన్ ఈగిల్, మరొకవైపు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ముద్రించి ఉంటుంది. ఈ విధమైనటువంటి నాణెం రెండో ముద్రణ 1933లో జరిగింది. అయితే ఇవి చెలామణిలోకి రాలేదు. అందుకు గల కారణం అప్పట్లో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ ఈ నాణేలను నిషేధించారు. ప్రస్తుతం ఈ నాణెం అత్యధిక స్థాయిలో ఈ వేలం పాటలు అమ్ముడు పోవడంతో వేలం నిర్వాహకులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…