అగ్రరాజ్యం అమెరికాలో ఓ బంగారు నాణెన్ని వేలానికి వేశారు. అయితే వేలంపాటలోఈ నాణెం రికార్డు స్థాయిలో అమ్ముడు పోవడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మంగళవారం న్యూయార్క్ నగరంలో జరిగిన సోథేబై వేలంలో 1933 నాటి డబుల్ ఈగిల్ బంగారు నాణేన్ని వేలానికి వేయగా.. ఈ నాణేన్ని 18.9 మిలియన్ డాలర్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత భారతీయ కరెన్సీ ప్రకారం ఈ నాణెం విలువ ఏకంగా రూ.142 కోట్ల రూపాయలు.

ఈ విధంగా ఈ డబుల్ ఈగిల్ బంగారు నాణెం మాత్రమే కాకుండా, ఈ వేలం పాటలో ప్రపంచంలోనే అరుదైన ఒక స్టాంపు కూడా8.3 డాలర్లు అనగా 61 కోట్ల రూపాయలకి అమ్ముడుపోవడం ఎంతో విశేషం అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ డబుల్ ఈగిల్ బంగారు నాణెం వేలంపాటలో సుమారుగా 15 మిలియన్ డాలర్ల వరకు పోతుందని వేలం నిర్వాహకులు భావించగా వారి అంచనాలకు అందకుండా ఏకంగ ఈ నాణెం 19 మిలియన్ డాలర్లు పోవడంతో వారు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం వేలంపాటలో అరుదైన స్థాయిలో అమ్ముడుపోయిన ఈ నాణెం ఒక వైపు అమెరికన్ ఈగిల్, మరొకవైపు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ముద్రించి ఉంటుంది. ఈ విధమైనటువంటి నాణెం రెండో ముద్రణ 1933లో జరిగింది. అయితే ఇవి చెలామణిలోకి రాలేదు. అందుకు గల కారణం అప్పట్లో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ ఈ నాణేలను నిషేధించారు. ప్రస్తుతం ఈ నాణెం అత్యధిక స్థాయిలో ఈ వేలం పాటలు అమ్ముడు పోవడంతో వేలం నిర్వాహకులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here