V. V. Vinayak : ఆది సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన వినాయక్ ఆ తరువాత దిల్, చెన్నకేశవ రెడ్డి, అదుర్స్, కృష్ణ, యోగి, లక్ష్మి, సాంబ తదితర సినిమాలతో అలరించాడు. కొన్ని మాస్ ఎంటర్ టైనర్స్ అయితే మరి కొన్ని కామెడీ చిత్రాలు గా అలరించాయి. మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకుల్లో వి వి ఒకరు. సినిమా ఇండస్ట్రీలో హీరోలు ప్రొడ్యూసర్ల వారసులను సినిమాల్లోకి తీసుకురావడం మామూలే. ఇక వినాయక్ అలా ఇద్దరు వారసులను లాంచ్ చేసాడు. నాగార్జున తనయుడు అఖిల్ ను, అలాగే బెల్లంకొండా సాయి ని సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు.

అఖిల్ సినిమా విషయంలో నేను చేసిన తప్పు అదే…
నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ని లాంచ్ చేస్తూ వినాయక్ తీసిన భారీ బడ్జెట్ సినిమా ‘అఖిల్’ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. సినిమా సగటు ప్రేక్షకుడికే కాదు అక్కినేని అభిమానులకు కూడా నచ్చలేదు. ఇక ఈసినిమా పరాజయానికి తాను చేసిన తప్పులను నిజాయితీగా ఒప్పుకున్నాడు వినాయక్. సినిమా ఒక పెద్ద హీరో కొడుకుతో తీస్తున్నాను కాబట్టి ఎంట్రీ ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటూ కథ విషయాన్ని ఆలోచించలేదు. అనుకున్నది అనుకున్నట్లు గా కథ తీసుంటే సినిమా ఫలితం వేరేలా ఉండేది.

పెద్ద హీరో కొడుకైనా మొదటి సినిమా సింపుల్ గా ఒక లవ్ స్టోరీ లాగా ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఆ తరువాత బెల్లం కొండ సాయి శ్రీనివాస్ విషయంలో సక్సెస్ అయ్యాను అంటూ తప్పులను నిజాయితీ గా ఒప్పుకున్నాడు వి వి. ప్రస్తుతం వినాయక్ బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తో హిందీ లో తెలుగు ఛత్రపతి సినిమాను రీమేక్ చేస్తున్నాడు. సినిమా పూర్తయ్యాక ప్రమోషన్స్ బాగా చేయాలని అనుకుంటున్నట్లు వినాయక్ తెలిపారు.



























