Vallabhaneni Janardhan : ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో పోలీస్ అధికారి పాత్రలో నటించి ప్రేక్షకుల మదిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు వల్లభనేని జనార్దన్. నటుడుగా కంటే ముందు జనార్దన్ గారు డైరెక్టర్. ఆయన స్వస్థలం విజయవాడ, చిన్నతనం నుండే నాటకాల మీద ఇష్టం కారణంగా రంగస్థలం నటుడుగా కొనసాగారు. ఇక చదువుయ్యాక సినిమాల మీద ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చారు. ఇక మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్ గా రాఘవేంద్రరావు సినిమా గజదొంగ, తిరుగు లేని మనిషి, రగిలే జ్వాల, కొండవీటి సింహం సినిమాలకు పనిచేసారు. ఇక డైరెక్టర్ గా మొదటగా ‘మామ్మ గారి మనవళ్లు’ అనే సినిమాను నిర్మించినా ఆర్థిక ఇబ్బందులకు వల్ల ఆగిపోయింది. ఆ తరువాత డైరెక్టర్ గా ‘అమాయక చక్రవర్తి’ అనే సినిమాను తీసి మంచి విజయం సాధించారు. అయితే ఈ సినిమాకంటే ముందు నిర్మాత విజయ బాపిణీడు కూతురుని పెళ్లి చేసుకుని ఆయన సలహా మేరకు ఆ సినిమాను తీశారు.

శ్రీను నా ఎకరం విలువ చేయడు…
వల్లభనేని జనార్దన్ గారు విజయ బాపినీడు గారి కూతుర్ని పెళ్లి చేసుకొని ఇక ఆయన నిర్మాణం వచ్చే సినిమాల్లో నటిస్తూ మరియు సినిమా నిర్మాణం కూడా చూసుకునేవారు. అంతకుముందు సినిమా డైరెక్షన్ లో అనుభవం ఉన్న ఆయన విజయ బాపినేడు గారితో కలిసి పనిచేసారు. అటువంటి సమయంలోనే చిరంజీవి గారితో చిన్న క్లాష్ వచ్చింది. డైరెక్టర్ లేకుండా నేనే కష్టపడుతున్నాను అన్నట్లుగా చిరంజీవి మాట్లాడటంతో మా ఇంట్లోనే ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు ఆయన ఎందుకు కష్టపడటం అని నేను అన్నాను. అందుకు ఆయనకు కోపం వచ్చింది అంటూ జనార్దన్ గారు ఒక పాత ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో చిరంజీవి గారు సారీ చెప్పమని అడిగారట. అయితే వల్లభనేని జనార్దన్ గారు నేను చెప్పనని ఖరాఖండిగా చెప్పశారట. మధ్యలో వ్యక్తులు మాటలు కలిపి ఎన్నో చేరవేస్తారంటూ తెలిపారు.

ఇక శ్రీను వైట్ల తో ‘నీ కోసం’ సినిమా చేయడం గురించి మాట్లాడిన జనార్దన్ గారు రవితేజతో తీసిన నీకోసం సినిమా నిర్మాణం మధ్యలో ఆగిపోతే జనార్దన్ గారు తీసుకుని స్క్రీన్ ప్లే కొంత మార్చి బడ్జెట్ తగ్గించి సినిమా పూర్తి చేసి సినిమాను రామోజీరావు కు అమ్మేశారట. అయితే శీనువైట్ల ఇబ్బందుల్లో ఉన్నపుడు బ్రేక్ ఇచ్చింది నేనైతే రామోజీరావు గురించి చెబుతాడు. శీను పెద్ద డైరెక్టర్ అయ్యాక పది కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుని ఉండవచ్చు అయితే నా ఎకరం పొలం మద్రాస్ లో 12 కోట్లు, నా ఎకరా విలువ చేయడు అంటూ ఆయన పాత ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 29 న వల్లభనేని జనార్దన్ గారు అనారోగ్య సమస్యలతో మరణించారు.































