Vangalapudi Anitha : ఆరోజు చెప్పు చూపించా… ఇప్పుడు ఇంటికి వెళ్లి మరీ కొడతా…: వంగల పూడి అనిత

0
153

Vangalapudi Anitha : ఎక్కడైనా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. ఒకప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు చాలా హుందాగా ఉండేవి. ఒకరిని విమర్శించాలన్నా చాలా హుందాగానే పార్టీలకు అతీతంగా వ్యవహరించేవారు నాయకులు. అయితే మారుతున్న పరిస్థితులకనుగుణంగా రాజకీయాలు మారిపోయాయి. ఇక రాజకీయ నాయకులు విలువలు లేకుండా తయారయ్యారు. ఈరోజు ఒక పార్టీలో ఉండేవారు పొద్దున్నే ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. ఇక విమర్శలకు అడ్డూ అదుపు లేకుండా మనకు శత్రువైన పార్టీని తిట్టడం కోసం అన్నట్లు కొంతమంది నాయకలను మౌత్ పీస్ లుగా ఎంచుకుంటున్నారు పార్టీ అధినేతలు. ఎన్ని ఎక్కువ బూతులు వస్తే అంత గొప్ప అనే చందంగా వ్యవహారం మారిపోయింది. ఒక పార్టీ అని లేకుండా ఏపీ లోని అన్ని ప్రధాన పార్టీల్లోనూ ఇదే తంతు. మీరు బూతులు తిడుతున్నారు కనుకనే మేము తిట్టాల్సి వస్తోంది అని సాకులు వెతుక్కుంటున్నా మొత్తానికి అన్ని పార్టీలలోనూ అభ్యంతరకర భాష ఎక్కువైంది.

వాళ్ళు అలా మాట్లాడారనే చెప్పు చూపించా…

వైసీపీ, టీడీపీ రాజకీయ ప్రత్యర్తి పార్టీలే అయినా ఆజన్మ శత్రువులుగా ఒకరిని ఒకరు నిందించుకోవడం చూస్తున్నాం. వైసీపీ నుండి కొంతమంది లీడర్ల విమర్శలకు హద్దులు లేకుండా పోయాయి. చదువుకోని వారు కూడా మాట్లాడని విధంగా బూతులు యధేచ్చగా మాట్లాడుతూ వ్యక్తిగతంగా కొంతమంది టీడీపీ నాయకలను వారి కుటుంబ సభ్యులను విమర్శించారు. ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారి మీద విమర్శలు చేసారు అని చంద్రబాబు కూడా మీడియా ముందు ఏడ్చారు.

ఆ సందర్భంలోనే చెప్పు చూపించి కొడకల్లారా అంటూ మాట్లాడానని వంగల పూడి అనిత రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఎదుటి వారు నోరు ఉంది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఒక్కోసారి మాకు కోపం వస్తుంది అందుకే అలా మాట్లాడానని ఇంకో సారి అలా మాట్లాడితే చెప్పు చూపించడం కాదు ఈసారి ఇంటికి వెళ్లి కొడతా అంటూ ఫైర్ అయ్యారు. మా అధినేత చంద్రబాబు ఎలాంటి అభ్యంతరక భాష మాట్లాడినా ఒప్పుకోరని వెంటనే పిలిచి మందాలిస్తారని కానీ వైసీపీ వాళ్ళ మాటలకు మా కోపం కట్టలు తెంచుకుంది అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందంటూ చెప్పారు వంగలపూడి అనిత.