Vanisree brother Ramanayya : నెల్లూరుకి చెందిన రత్నకుమారిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మొదట చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె అనతి కాలంలోనే హీరోయిన్ గా ఎదిగి కలాభినేత్రిగా పేరు తెచ్చుకున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు వాణిశ్రీ. సావిత్రి గారి తరువాత అంతటి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వాణిశ్రీ. తెలుగు, కన్నడ, తమిళం ఇలా అన్ని భాషల్లో అగ్ర హీరోయిన్ గా ఎదిగిన వాణిశ్రీ గారు పెళ్లయ్యాక నటనకు దూరమై మళ్ళీ రీఎంట్రీలో అత్త పాత్రలో మెప్పించింది. ఇక ఆమె సినిమా కెరీర్ గురించి పలు విషయాలను ఆమెకు అసిస్టెంట్ గా పనిచేసిన రమణయ్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఇద్దరు అగ్ర హీరోలు అక్కతో ఎలా ఉండేవారంటే…
రమణయ్య గారు అప్పటి హీరోలు హీరోయిన్లతో ఎలా ఉండేవారు అనే విషయాన్ని తెలిపారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లు వాణిశ్రీ గారితో ఎలా ఉండేవారో తెలిపారు. ఎన్టీఆర్ గారి సొంత సినిమా ‘విరాట పర్వం’లో నటించినపుడు వాణిశ్రీ గారిని చాలా చక్కగా చూసుకున్నారట ఎన్టీఆర్. మొదట ఆయన సొంత బ్యానర్ లో సినిమా అనగానే వాణిశ్రీ గారికి వద్దని, ఆయన చాలా కోపంగా ఉంటారేమో అని ఇంట్లో వాళ్లందరం చెప్పామంటూ రమణయ్య తెలిపారు. అయితే ఎన్టీఆరి గారు ఆయన భార్య ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా పలకరించి షూటింగ్ కి ఆహ్వానించారు. అక్కను ఎన్టీఆర్ గారు ఏమండి అని పిలిచేవారు అంటూ చెప్పారు.

ఇక నాగేశ్వరావు గారు అమ్మాయి అంటూ పిలిచేవారని రమణయ్య తెలియపారు. అక్క అందరితో చాలా మర్యాదగా నడుచుకోవడం వల్ల ఆమెతో అందరూ చాలా మర్యాదగా ఉండేవారని, నాగేశ్వరావు గారు ఎన్టీఆర్ గారిలాగా కాదు బాగా సరదాగా ఉంటూ జోకులేసేవారు అంటూ తెలిపారు. ఎన్టీఆర్ గారు చాలా గంభీరంగా ఉండేవారంటూ అదే వారిద్దరికీ తేడా అంటూ తెలిపారు.



























