Varalakshmi Sharath Kumar : ప్రస్తుతం సినిమాల్లో విలనిజం మారిపోయింది. హీరో కంటే స్టైలిష్ లుక్ లో విలన్లు అదరగొడుతున్నారు. అయితే ఎటు చూసినా మగ విలన్లే కనిపిస్తున్న తరుణంలో మళ్ళీ ఆడ విలన్ హవా వచ్చేసింది. వరలక్ష్మి రూపంలో ఒక లేడీ విలన్ ఇండస్ట్రీకి దొరికింది. రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమాలో వరలక్ష్మి జయమ్మ పాత్రలో దుమ్ములేపి రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తరువాత తానే అట్రాక్షన్ గా నిలిచింది. అంతకు ముందు వచ్చిన సందీప్ కిషన్ ‘రామకృష్ణ తెనాలి’ సినిమాలో విలన్ గా నటించి తెలుగు సినిమా అరంగేట్రం చేసిన వరలక్ష్మి తాజాగా ‘వీర సింహారెడ్డి’ చెల్లిగా సీమ బిడ్డగా అదరగొట్టింది.

లైఫ్ లో బోల్డ్ గా ఉండే వరలక్ష్మి.. పెళ్లితో పనిలేదంటూ…
వరలక్ష్మి తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు. ఆయన మొదటి భార్య కూతురు అయిన వరలక్ష్మి చెన్నై లోనే పుట్టి పెరిగింది. అక్కడే చదువుకున్న వరలక్ష్మి అన్ని రకాల నృత్య రీతులు నేర్చుకుని నటనలో అనుపమ్ ఖేర్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకుంది. మొదట శంకర్ ‘బాయ్స్’ సినిమాలో హీరోయిన్ అవకాశం వచ్చినా తండ్రి శరత్ కుమార్ చదువుకుంటోంది వద్దు అనడంతో ఆఫర్ మిస్ అయింది. ఆ తరువాత ‘ప్రేమిస్తే’ సినిమా ఆఫర్ కూడా తండ్రి వద్దనడంతో పోయింది. ఇక చివరకు శింబు తో ‘పోడా పొడి’ లో అవకాశం మాత్రం వరలక్ష్మి మిస్ అవ్వాలని అనుకోలేదు. ఇక నాన్న శరత్ కుమార్ కి తెలియకుండా సినిమా ఓకే చేసింది. ఇక తండ్రికి వరలక్ష్మి తల్లి అలాగే శరత్ కుమార్ రెండో భార్య రాధిక ఇద్దరూ ఒప్పించడంతో చివరకు అంగీకరించారు.

అలా సినిమా చేసిన వరలక్ష్మి మొదటి సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఇక ఆ సినిమా తరువాత కన్నడ, మలయాళం అలా చేస్తున్న సమయంలో మెల్లగా హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో మంచి క్యారెక్టర్ లభిస్తే చేయడం మొదలు పెట్టింది. అలా ప్రస్తుతం విలన్ గా అవతరించింది. సినిమాల్లో ఎంత చక్కగా నటించే వరలక్ష్మి రియల్ లైఫ్ లో మాత్రం బోల్డ్ గా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తుంది. విశాల్ చిన్నప్పటి నుండి స్నేహితుడవడంతో ఇద్దరూ కలిసి కనిపిస్తుందడంతో విశాల్ తో పెళ్లెప్పుడు అని మీడియా అడిగితే విశాల్ నా ఫ్రెండ్ అంతే, అయినా పెళ్లి మీద నాకు అభిప్రాయం నమ్మకం లేవు. మగాడు కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే ఒక అమ్మాయికి అవసరం అని నా ఉద్దేశం అని బోల్డ్ గా చెప్పేసింది. నేను పెళ్లి చేసుకోను అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ అమ్మడు సోషల్ ఆక్టివిటీస్ లోనూ ముందుంటుంది. తనవంతుగా మూగ జీవాలు అలాగే మానసిక వికలాంగుల కోసం కృషి చేస్తోంది.



























