Varun Sandhesh : శేఖర్ ఖమ్ముల ‘హ్యాపీడేస్’ సినిమాతో పరిచయమైన వరుణ్ సందేశ్ మొదటి సినిమాతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఏమాత్రం నటనలో అనుభవం లేకపోయినా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో మరో సారి హిట్ కొట్టాడు. ఇక వరుణ్ సందేశ్ ఏమైంది ఈవేళ, డి ఫర్ దోపిడీ, పాండవులు పాండవులు తుమ్మెద, మామ మంచు అల్లుడు కంచు కుర్రాళ్ళు, మరో చరిత్ర వంటి సినిమాల్లో నటించాడు. అయితే ఆశించినంత విజయాలు వరుణ్ కి లేకపోవడంతో కెరీర్ గ్రాఫ్ పడిపోయింది.

వితికకు నెగెటివ్ కామెంట్స్ ఎక్కువ వచ్చాయి…
ఇక బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న వరుణ్ సందేశ్ అతని భార్య వితిక షేరు. బిగ్ బాస్ తరువాత పరిస్థితులను వరుణ్ పంచుకున్నాడు. వరుణ్ టాప్ ఫైవ్ లో నిలిచి బయటికి వచ్చాడు. అయితే బిగ్ బాస్ తరువాత తన భార్య కు చాలా నెగెటివ్ కామెంట్స్ వచ్చేవని చెప్పాడు. అలాంటి మెసేజెస్ నాకు చూపించి బాధపడేది. కొన్ని కామెంట్స్ ను చెప్పడానికి కూడా కష్టంగా అనిపిస్తాయి. బిగ్ బాస్ లో ఇరవై నాలుగు గంటలు మేము చేసినవి చూపించరు.

వాటిలో వాళ్లకు కావాల్సినవి కొన్ని మాత్రమే చూపిస్తారు. అలాంటివి చూసి ఒకరి క్యారెక్టర్ ఎలా డిసైడ్ చేసి ఒక మనిషి మీద ఇలాంటి హేట్ కామెంట్స్ పెడతారు అంటూ వరుణ్ ఫైర్ అయ్యాడు. బిగ్ బాస్ తరువాత చాలా రోజులు ఆ కామెంట్స్ నుండి తెరుకోడానికి వితికాకు సమయం పట్టింది. కానీ తను చాలా స్ట్రాంగ్ వుమన్ మా ఇద్దరిలో తానే స్ట్రాంగ్ అనిపిస్తుంది. నన్ను బాగా గైడ్ చేస్తుంది, ఇద్దరం ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఉండదు, ఇద్దరం సమానం అంటూ చెప్పాడు వరుణ్ సందేశ్.































