Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరోక్షంగా అల్లు అర్జున్ కు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. గత కొంతకాలంగా మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య వివాదం నెలకొన్న సంగతి మనకు తెలిసిందే. ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కి కాకుండా వైకాపా నాయకుడికి అల్లు అర్జున్ మద్దతు తెలపడంతో ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది.

ఈ క్రమంలోనే పలువురు మెగా హీరోలు వారికి సమయం వచ్చినప్పుడు అందులో అర్జున్ పట్ల తమదైన శైలిలోనే కౌంటర్ వేస్తున్నారు. తాజాగా మట్కా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా వరుణ్ తేజ్ అల్లు అర్జున్ గురించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తాను నేడు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం తన కుటుంబ సభ్యులని తెలిపారు. పెదనాన్న చిరంజీవి పవన్ కళ్యాణ్ బాబాయ్ తన తండ్రి సపోర్ట్ కారణంగానే నేను ఇక్కడ ఉన్నాను. నా జీవితంలో వారంతా చాలా ప్రత్యేకమని తెలిపారు. ఇక చరణ్ అన్నతో నాకు చాలా మంచి బాండింగ్ ఉంది సినిమాల పరంగా లేదా తనకు ఏదైనా బాధగా అనిపించినప్పుడు చరణ్ అన్నతో మాట్లాడితే ఆ బాధ మొత్తం పోతుందని అన్నయ్య తన భుజంపై చేయి వేస్తే కొండంత ధైర్యం వస్తుందని అదే నాకు 1000 కోట్లతో సమానమని వరుణ్ తేజ్ తెలిపారు.
మర్చిపోకూడదు..
ఇలా మన జీవితంలో మనకు సపోర్ట్ గా నిలిచిన వారిని మనకు సక్సెస్ వచ్చిన తర్వాత ఎప్పటికీ మర్చిపోకూడదు అలా మర్చిపోయాము అంటే మన సక్సెస్ ఏమాత్రం పనికిరాదని వరుణ్ తేజ్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అయితే ఈ వ్యాఖ్యలు ఈయన అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేశారని పలువురు పెద్ద ఎత్తున కామెంట్లు చేయడంతో మరోసారి వీరి అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతుంది.































