Vasanthi Krishnan : మోడలింగ్ తో మొదలై, కన్నడ సినిమాలను చేసి మళ్ళీ తెలుగు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన తెలుగమ్మాయి వాసంతి కృష్ణన్. తిరుపతికి చెందిన వాసంతి ప్లస్ టూ తరువాత డిగ్రీ కోసం బెంగళూరు వెళ్లి పైలట్ అవ్వాలని అనుకుంది. ఆ తరువాత యాక్టింగ్ కెరీర్ వైపు అడుగులేసి కన్నడ ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది. మోడలింగ్ చేస్తూ ఆ తరువాత సినిమాల్లో హీరోయిన్ గా కొన్ని కన్నడ సినిమాలు చేసిన వాసంతి, తెలుగు ఇండస్ట్రీ కి మా టీవీ ద్వారా అడుగుపెట్టింది. తెలుగులో సిరిసిరి మువ్వ, గుప్పెడంత మనసు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

రిషి కి నేను పడిపోయాను… తానే నా ఫస్ట్ క్రష్…
గుప్పెండత మనసు సీరియల్ లో సాక్షి పాత్ర మొదట నేనే చేశాను. కొన్ని రోజుల షూటింగ్ తరువాత రాఘవేంద్ర రావు గారి సినిమాలో ఆఫర్ రావడంతో సీరియల్ వదులుకోవాల్సి వచ్చింది. ఏమాత్రం ఇష్టం లేకున్నా సీరియల్ ను వదులుకున్నాను. రిషి ని ప్రేమించే అమ్మయిగా సాక్షి పాత్రలో మొదట నేనే చేశా, ఆ సీరియల్ బాగా ట్రెండ్ లో ఉంది చాలా బాధేసింది వదులుకున్నపుడు అంటూ చెప్పింది. ఇక ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి గారి పెయిర్ గా నటించడానికి కారణాలను వివరించింది. సుధీర్ పక్కన ఆల్రెడీ దీపిక పిల్లి ఎంపిక చేసారు.

ఇక నాకు ఛాయిస్ ఇచ్చినపుడు సీనియర్ యాక్టర్ కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారితో అయితే బాగుంటుందని ఆయన తో చేశాను. ఈ సినిమా నాకు తెలుగులో నా కెరీర్ కు ప్లస్ అవుతుందని అనుకుంటున్నాను అంటూ చెప్పింది వాసంతి. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తన తండ్రి తాను ఇంటర్మీడియట్ చదివే సమయంలో ఆక్సిడెంట్ లో చనిపోయారని, తల్లి వ్యాపారం చేస్తారని ఆమె ప్రోత్సహం తోనే ఇండస్ట్రీ కి వచ్చానని చెప్పింది. ఇక నా ఫస్ట్ క్రష్ ఇంటర్ చదివే సమయంలో ఒకరిని చూసినపుడు కలిగింది. ఇక డిగ్రీ లో కూడా ఒకరిద్దరిని చూసి ఇష్టపడ్డాను కానీ ఎవరికి వెళ్లి ప్రొపోజ్ చేయలేదు. ఎవరైనా నచ్చితే నాలో నేనే ఆనందపడుతాను కానీ వారికి వెళ్లి చెప్పను అంటూ చెప్పింది వాసంతి. త్వరలోనే మరో పెద్ద ప్రాజెక్ట్ తో తెలుగులో రాబోతున్నట్లు వాసంతి చెప్పింది.
































