Veera Simha Reddy: సాధారణంగా హీరో హీరోయిన్లు సినిమా స్టోరీ నచ్చిన తర్వాతనే ఆ సినిమాలలో నటించడానికి అంగీకరిస్తారు. కొన్ని సందర్భాలలో సినిమా స్టోరీ నచ్చక లేక ఇతర కారణాలవల్ల కొన్ని సినిమాలలో నటించకుండా రిజెక్ట్ చేస్తారు. అయితే ఇలా వారు రిజెక్ట్ చేసిన సినిమాలు వేరొకరు చేసి ఆ సినిమా హిట్ అయితే అనవసరంగా మిస్ చేసుకున్నామని వారు తప్పకుండా బాధ పడతారు.
తాజాగా సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన అనుష్క శెట్టి కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకొని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సూపర్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క శెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఇక బాహుబలి సినిమాలో ప్రభాస్ సరసన నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే చాలాకాలంగా అనుష్క సినిమాలకు దూరంగా ఉంటుంది.
ఇక ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం ఒకే ఒక్క సినిమా ఉంది. కొందరు దర్శకులు ఆమె కోసం ప్రత్యేకంగా కథ తయారు చేసుకుని వెళ్లినా కూడా ఆమె సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇటీవల అనుష్క తనకి వచ్చిన అవకాశాలు అన్నింటిని రిజెక్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలో కూడా అనుష్కకి అవకాశం వచ్చింది. అయితే అనుష్క ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేయడంతో అనుష్క స్థానంలో మలయాళీ బ్యూటీ హనీ రోజ్ బాలకృష్ణ సరసన నటించిన. మొట్టమొదటిసారిగా వీర సింహారెడ్డి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హనీ రోజ్ పాత్ర ఈ సినిమాలో అద్భుతంగా ఉంది.
ఈ సినిమాలో మొదట హనీ రోజు స్థానంలో అనుష్కని సంప్రదించగా ఆమె కారణం చెప్పకుండా ఆఫర్ ని రిజెక్ట్ చేయటంతో ఆ తర్వాత హనీ రోజ్ ఆ పాత్రలో నటించింది. ఈ సినిమాలో హనీ రోజ్ పాత్ర మంచి గుర్తింపు వచ్చింది. అయితే వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ సరసన నటించే అవకాశం వచ్చినా కూడా అనుష్క దానిని తిరస్కరించి ఇప్పుడు బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…