Venkatesh: దగ్గుబాటి కుటుంబం నుండి హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విక్టరీ వెంకటేష్ గురించి తెలియనివారు ఉండరు. ఎన్నో దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతున్న వెంకటేష్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఇటీవల వెంకటేష్ నటించిన ఎఫ్3 సినిమా విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇక ప్రస్తుతం వెంకటేష్ హీరోగా మాత్రమే కాకుండా కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలలో కూడా నటిస్తున్నాడు. ఈ క్రమంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా సినిమాలో కూడా వెంకటేష్ కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమా కథని మలుపు తిప్పే కీలక పాత్రలో వెంకటేష్ 15 నిమిషాల పాటు నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
తమిళ భాషలో మంచి హిట్ అయిన ‘ఓ మై కడువులే’ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేసి ‘ఓరి దేవుడా’ అనే పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాకి మాతృకను తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తునే దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జోడిగా మితిలా పార్కర్ నటించింది. అంతే కాకుండా ఆశ భట్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ వంటి వారు కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 21వ తేదీన విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
ఇదిలా ఉండగా తాజాగా విక్టరీ వెంకటేష్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా సినిమాలలో ఫుల్ లెన్త్ పాత్రలో నటించినందుకు వెంకటేష్ 5 నుండి 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. అయితే ఈ సినిమాలో కేవలం 15 నిమిషాల పాత్ర కోసం వెంకటేష్ 5 రోజులపాటు షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఐదు రోజుల షూటింగ్ కోసం వెంకటేష్ ఏకంగా మూడు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలలో నిజం ఎంతుందో తెలియదు కానీ.. వెంకటేష్ రెమ్యురేషన్ మరీ ఎక్కువగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…