Venu Swamy comments : ప్రముఖ ఆస్ట్రాలజర్ అంటూ చెప్పుకుని తిరిగే వేణు స్వామి సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల జీవితాల్లో జరగబోయేవి ఇవే అంటూ ఎప్పటికప్పుడు చెబుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తుంటాడు. గతంలో ఇలాగే సమంత నాగచైతన్య విడిపోయాక వాళ్ళు విడిపోతారని నేను ముందే చెప్పానని అన్నాడు. ఇక రష్మిక తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పిందే నేనేనని, తనతో వాళ్ళింట్లో ప్రత్యేక పూజలు కూడా చేసానంటూ చెప్పారు. ఇక మెగాస్టార్ కూతురుది వాళ్ళ బాబాయ్ జాతకం లాంటిదంటూ మూడో పెళ్లి చెసుకుంటుందంటూ మాట్లాడాడు. ఇవన్నీ ఒకెత్తు అయితే ఇప్పుడు ఇద్దరు టాలీవుడ్ సెలబ్రిటీస్ చనిపోతారంటూ చెప్పి వైరల్ అవుతున్నాడు.

ఒక హీరో, ఒక హీరోయిన్ మరణిస్తారంటూ జోష్యం…
కొంతమందికి జాతకాల మీద నమ్మకం ఉండొచ్చు కొంతమందికి ఉండకపోవచ్చు అది వారి వ్యక్తిగత విషయం. అయితే ఈ వేణు స్వామి తనను తాను మార్కెట్ చేసుకోడానికి సెలబ్రిటీల జీవితాల్లో ఇలా అవుతాయి అంటూ మాట్లాడటం సరైనది కాదు అంటూ సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామ రావు మాట్లాడారు. సమంత, నాగచైతన్య విడిపోతారు నేను చెప్పాను అంటూ కామెంట్స్ చేసాడు అది వారి వ్యక్తిగత విషయం, అందులో ఇతనెందుకు మాట్లాడటం. డబ్బు సంపాదనకోసం ఇలాంటి మార్గాన్ని ఎంచుకోవడం ఏమిటి అంటూ ఫైర్ అయ్యారు.

విజయ్ దేవరకొండకు ఇంకా ఫ్లాప్లు వస్తాయి, ఆర్థిక కష్టాలు వస్తాయి అంటూ మాట్లాడాడు. ఇక సమంత, ప్రభాస్ మరణిస్తారు అంటూ ఏవేవో మాట్లాడుతున్నాడు. అతను చెప్పేవి నిజం అయ్యేది పక్కన పెడితే మార్కెట్ లో తనని తాను పబ్లిసిటీ చేసుకోడానికి ఇలాంటి చెత్త స్ట్రాటెజీ వాడుతున్నాడు, ఈ వైఖరి తప్పు అంటూ ఇమంది అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ఇతని మీద గౌరవం ఉండేది, ఇలాంటి చేష్టలవల్ల ఆది పోయింది అంటూ మాట్లాడారు.


































