Venu Thottempudi : టీవీ టవర్ అంటూ ఒకప్పుడు బాగా పేరు తెచ్చుకున్న హీరో వేణు సినిమాలకు దూరమై చాలా కాలమైంది. పదేళ్ళ తరువాత మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న వేణు, రవితేజ హీరోగా వస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇటీవలే వేణు పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. స్వయంవరం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన వేణు తోట్టెంపూడి, ఆ తరువాత చిరునవ్వు, చెప్పవే చిరుగాలి, కళ్యాణ రాముడు, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరేలితే వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన వేణు సినిమాలకు సడన్ గా దూరం అయ్యాడు.

మళ్ళీ సినిమాల్లోకి.. మొదటి ప్రాముఖ్యం వాటికే…
పదేళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న వేణు సినిమాలకు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల దూరంగా ఉన్నట్లు చెప్పారు. సినిమాలకే తన జీవితంలో మొదటి ప్రాధాన్యం ఉన్నా అనుకోని కారణాల వల్ల దూరమయ్యానని ఇకపై మళ్ళీ సినిమాల్లో నటించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. వేరే పనుల్లో బిజీగా ఉన్నానని లాక్ డౌన్ టైములో తీరిక దొరకడం వల్ల కుటుంబంతో ఎంజాయ్ చేసానని చెప్పారు. ఇక అదే సమయంలో చాలా వెబ్ సిరీస్ చూసానని అందులో కొంతమంది నటన అసూయ కలిగించిందని చెప్పారు.

ఇక ‘రామారావు ఆన్ డ్యూటీ’ డైరెక్టర్ చాలా సార్లు ఆ పాత్ర కోసం అడిగినా దాట వేస్తువచ్చానని చెప్పారు. ఒకసారి కలవండి సినిమా చేయక పోయినా అని అంటే మీట్ అయ్యాను, అయితే రామారావు ఆన్ డ్యూటీ లో మురళీధర్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్ర లా డిజైన్ చేసారో చెప్పారు. ఇక ఆ పాత్ర కేవలం నన్ను దృష్టిలో పెట్టుకుని చేసారని చెప్పడం, పాత్ర నచ్చడంతో ఒక చేసానని, ఇంకా ఇతర ప్రాజెక్టులు కూడా ఓకే చేసినా మొదట రామారావు ఆన్ డ్యూటీ వస్తోందని చెప్పారు.

































