Venu Thottempudi : ‘స్వయంవరం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో వేణు తొట్టెంపూడి. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న వేణు ఆతరువాత చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఉరేళితే వంటి సినిమాలతో మంచి హిట్లు అందుకున్నాడు. అయితే ‘దమ్ము’ సినిమా తరువాత సినిమాలకు దూరమైన వేణు చెన్నై లో స్థిరపడి తన వ్యాపారాల్లో బిజీ అయ్యారు. మళ్ళీ చాలా రోజుల గ్యాప్ తరువాత రవితేజ సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ లో నటించారు. మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంటున్న వేణు ఆయన సినిమా కెరీర్ గురించి విశేషాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

జగపతి బాబు తో మాటలు లేవు…
వేను తన కెరీర్ లో ఇతర హీరోలతో కలిసి ఎక్కువగా సినిమాలను చేసారు. శ్రీకాంత్, జగపతి బాబు ఇలా ఇతర హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలను అందులోనూ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేసారు హీరో వేణు. ఇక జగపతి బాబు తో కలిసి హనుమాన్ జంక్షన్, ఖుషి ఖుషిగా సినిమాల్లో కలిసి నటించారు. ఆయనతో మంచి సంబంధాలే ఉన్నాయంటూ తెలిపిన వేణు అయితే ఆయనతో ప్రస్తుతం మాటలు లేవు అంటూ తెలిపారు.

ఒక వ్యక్తికి డబ్బు అప్పుగా ఇచ్చినపుడు జగపతి బాబు గారు హామీ ఇచ్చి ఇప్పించారు. అయితే ఆ వ్యక్తి డబ్బు ఇప్పటికీ ఇవ్వలేదు. మొత్తం 16 లక్షలు పోయాయి. ఆ సమయంలో నాకది చాలా ఎక్కువ డబ్బు. కానీ జగపతి బాబు గారు కనీసం ఫోన్ చేసి ఆ తరువాత ఒకసారి అడగలేదు ఇచ్చాడా లేదా అని. నేను ఇక వదిలేసాను అతను ఇవ్వడని కానీ ఆ తరువాత జగపతి బాబు గారు నాతో మాట్లాడలేదు. ఇప్పటికీ ఆయనతో మళ్ళీ మాట్లాడలేదు అంటూ చెప్పారు వేణు తొట్టెంపూడి.



























