Victory Venkatesh, Neeraja : 1986 లో కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన విక్టరీ వెంకటేష్ గురించి రెండు తెలుగు రాష్ట్రలలో తెలియని వారుండరు. వెంకటేష్ నటించే సినిమాలు కుటుంబ సమేతంగా చూడదగినవి అనడంలో సందేహం లేదు. ఈయన సినిమా అంటేనే మినిమమ్ గ్యారెంటీ అన్న పేరు కూడా వుంది. వెంకీ సెంటిమెంట్ సన్నివేశాలు పందించడంలో దిట్ట, అలానే హాస్య ప్రధాన పాత్రలలో కూడా ఆయన చేయగలడని చాలా సినిమాలతో నిరూపించుకున్నాడు. దగ్గుబాటి రామానాయుడు గారి వారసుడిగా తెలుగు సినిమాలకు పరిచయం అయిన వెంకటేష్ గురించి అందరికి తెలిసిందే. అయితే వెంకటేష్ పర్సనల్ విషయాలు బయట పెద్దగా తెలియవు.

వెంకటేష్ భార్య నీరజ రెడ్డి…
వెంకటేష్ పర్సనల్ విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అభిమానులలో ఉంటుంది. ఆయన భార్య, పిల్లలు మీడియా ముందు పెద్దగా కనిపించరు. అయితే వెంకటేష్ భార్య పేరు నీరజా రెడ్డి. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన గంగవరపు వెంకట సుబ్బారెడ్డి, ఉషారాణిల కుమార్తె. వీరిది జమిందారి కుటుంబమే కాదు, వ్యాపారాలు కూడా బాగా వున్నాయట. విజయ అధినేత నాగిరెడ్డి గారి సలహాతో రామానాయుడు గారు ఈ సంబంధం చూడటం, వెంకటేష్ నీరజ లకు ఒకరికొకరు నచ్చడంతో 1989 లో పెళ్లి జరిపించారు. పేరుకు నీరజా రెడ్డి అయినా వీరు కమ్మ సామాజిక వర్గానికిని చెందిన వారే. వెంకటేష్ నీరజ లకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆశ్రిత, హయ వాహిని, భావన, అర్జున్ వారి పేర్లు. అయితే పిల్లలను ఇండస్ట్రీ కి దూరంగా పెంచుతున్నారు వెంకటేష్.

నీరజా రెడ్డి గారి అమ్మమ్మ వాళ్ల ఊరు మాత్రం కృష్ణ జిల్లా, కైకలూరు దగ్గర వరాహ పట్నం. ఎంబీఏ పూర్తి చేసిన నీరజ విద్యాభ్యాసం మదనపల్లిలోని సీఎస్ఐ గర్ల్ స్కూల్. అందులోనే పదవ తరగతి వరకు చదువుకున్నారు. తరువాత మదనపల్లిలోని వీటీ కాలేజీలో చదువుకున్నారు. ఇంకొక విశేషం ఏమీటంటే నీరజ గారి మేన మామ బీజేపీ నేత అయిన కామినేని శ్రీనివాసరావు. 2014 ఎన్నికలలో బీజేపీ తరపున కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల సమయంలో నీరజారెడ్డి వారి మేన మామ తరపున ప్రచారం కూడా చేశారట.


































