Vignesh Shivan: సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించాలని చెప్పాలి ప్రస్తుతం ఈమె తన పిల్లలతో కలిసి తన వ్యక్తిగత జీవితాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఇటీవల నయనతార తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను ఒక డాక్యుమెంటరీగా రూపొందించి నెట్ ఫ్లిక్స్ ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ డాక్యుమెంటరీ లో భాగంగా నయనతారతో ప్రేమలో పడటం గురించి డైరెక్టర్ విగ్నేష్ శివన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా విగ్నేష్ శివన్ మాట్లాడుతూ నయనతారతో మొదటిసారి పరిచయమైన తర్వాతనే ఆమెతో ప్రేమలో పడ్డానని తెలిపారు అయితే మా ప్రేమ విషయం కొంతకాలం పాటు చాలా రహస్యంగా ఉంచాము. ఎప్పుడైతే మా ప్రేమ విషయం బయటపడిందో అప్పుడు చాలామంది మా జోడిని యాక్సెప్ట్ చేయలేకపోయారు.
ఈ క్రమంలోనే మా ప్రేమ విషయం తెలియగానే ఒక మీమ్ వచ్చిందని గుర్తుచేసుకున్నాడు. ఒక అందమైన అమ్మాయి వెళ్లి బీస్ట్‌లాంటి వాడిని లవ్ చేస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారంటూ ఆ మీమ్‌లో ఉందని తెలిపాడు. అయితే ఆ మీమ్‌లో కుక్కకు బిర్యానీ తినిపిస్తున్నట్టు ఉందని తెలిపారు. ఇలాంటి పోస్టులు చూసి నేను నయనతార చాలా బాధపడ్డామని తెలిపారు..
మొదట్లో మా జోడిని చాలామంది యాక్సెప్ట్ చేయలేక భారీగా ట్రోల్స్ చేసేవారు క్రమక్రమంగా మమ్మల్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారని విఘ్నేష్ తెలిపారు.బస్ కండక్టర్ సూపర్ స్టార్ అయ్యారు అంటూ రజినీకాంత్ ఉదాహరణను గుర్తుచేస్తూ మన జీవితంలో ఏదీ అంత తేలికగా దొరకదని అన్నాడు. ఆ ట్రోల్స్ చూసి అప్పట్లో తాను లైట్ తీసుకున్న నయన్ మాత్రం చాలా బాధపడిందంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…