Vijay Devarakonda : పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం ‘లైగర్’ గురించి తెలిసిందే. ఈ సినిమా తెలుగు హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూరి జగన్నాథ్ తో పాటు చార్మీ, కరణ్ జోహార్ నిర్మాతలుగా వ్యవహారించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అయ్యి ఆశించిన విజయాన్ని దక్కించుకోలేక పోయింది. రియల్ బాక్సర్ అయిన మైక్ టైసన్ అతిథి పాత్రలో కనిపించినప్పటికీ ఫలితం రాలేదు.

లైగర్ సినిమా ఎఫెక్ట్ జనగణమన మీద పడినట్లేనా..?
అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్ సినిమా విడుదల తరువాత డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మరో సినిమా ‘జనగణమన’ అనౌన్స్ చేయడం తెలిదిందే. అయితే లైగర్ సినిమా ఫలితం జనగణమన మీద పడినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే చిత్రబృందం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే తాజాగా జరిగిన సైమా అవార్డ్స్ వేడుకకు విజయ్ దేవరకొండ హాజరు అవ్వడం జరిగింది.

ఈ వేడుకలో జనగణమన సినిమా గురించి విజయ్ ను ప్రశ్నించగా.. ఇక్కడికి అందరూ వేడుకను ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కాబట్టి జనగణమన సినిమా గురించి అందరూ మర్చిపోండి అని సినిమా గురించి చెప్పకుండా దాటవేశారు. అయితే విజయ్ చెప్పిన ఈ సమాధానంతో అందరూ ఆలోచనలో పడ్డారు. మొత్తానికి ఆ సమాధానం అర్థం ఏమిటో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాలి మరి.

































