Vijay Devarakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోగా విజయ్ దేవరకొండ నిలిచాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ.. ఆ పేరును నిలబెట్టుకోవడానికి మంచి సినిమాలనే ఎంచుకున్నాడు. రౌడీ హీరోగా పేరు ఉన్న విజయ్ దేవరకొండ.. స్టేజ్ మీద, మీడియాలో మాట్లాడే విధానం ఎంతోమందికి క్రేజీగా అనిపిస్తుంది.

చాలామంది విజయ్ దేవరకొండ పొగరుతో మాట్లాడతారని కామెంట్ చేస్తే, మరికొందరు మాత్రం అది కష్టంలో నుండి వచ్చిన పొగరు అంటూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్.. హీరోయిన్ రష్మికతో కలిసి ‘గీతా గోవిందం’ పేరుతో తీసిన సినిమా భారీ హిట్ అయింది. అప్పటి వరకు ఒక వర్గం ఆడియన్స్ కు ఫేవరెట్ గా ఉన్న విజయ్.. ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా దగ్గరయ్యాడు.
‘గీతా గోవిందం’ సినిమాలో రష్మిక, విజయ్ దేవరకొండ జంటను చూసిన జనాలు ఫిదా అయిపోయారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ కామెంట్లు చేశారు. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ లో ఇద్దరూ అదరగొట్టేశారు. అయితే ఈ సినిమా చూసిన తర్వాత ఇద్దరూ లవ్ లో ఉన్నారనే ప్రచారం సాగింది.
అందుకు తగ్గట్టుగానే వీరిద్దరు జంట పక్షుల్లా బయటకు కనిపించారు. అయితే తాజాగా ఓ మీడియా సంస్థ ప్రచురించిన కథన ప్రకారం.. రష్మికనే విజయ్ కి ప్రపోజ్ చేసిందట. రష్మిక రక్షిత్ శెట్టితో విడిపోయిన తర్వాత విజయ్ తనకు ఎంతో ఓదార్పునిచ్చాడని, కేర్ చూపించాడని రష్మిక వివరించినట్లు కథనంలో పేర్కొనబడింది.

Vijay Devarakonda:
‘గీతా గోవిందం’ సినిమా టైంలో విజయ్, రష్మికలు ఫ్రెండ్స్ గా ఉండగా.. రష్మికకు మాత్రం విజయ్ మీద ఏదో తెలియని ఫీలింగ్ ఉండేదట. విజయ్ చాలా స్పెషల్ అని రష్మిక మనసు చెబుతూ ఉండేదట. ‘డియర్ కామ్రేడ్’ సినిమా షూటింగ్ టైంలో రష్మికకు తాను విజయ్ ని ప్రేమిస్తున్నానని అర్థమైపోయిందని, ఒకానొక టైంలో ఆమె తన మనలోని ప్రేమను విజయ్ కి చెప్పిందట. మొదటి విజయ్ వద్దన్నాడని.. కానీ తర్వాత అంగీకరించాడని ఆ కథనంలో పేర్కొనబడింది.




























