Vijay Thalapathy:కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయ్ తలపతి గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. విజయ్ సంగీత అనే యువతని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 22 సంవత్సరాల క్రితం వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో జరిగింది.

ఇక 22 సంవత్సరాలు పాటు ఈ దంపతులు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే వీరి పిల్లలు పెరిగి పెద్దవుతున్న తరుణంలో వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోబోతున్నారనే వార్త వైరల్ గా మారింది.ఇలా పెళ్లి జరిగిన 22 సంవత్సరాలకు విడాకులు తీసుకొని విడిపోవడం ఏంటి అని అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా విజయ్ సంగీతల వైవాహిక జీవితం గురించి ఇలాంటి వార్తలు రావడానికి గల కారణం గత కొద్దిరోజులుగా విజయ్ భార్య సంగీత విజయ్ సినిమా ఫంక్షన్లకు హాజరు కాకపోవడమే ఈ అనుమానాలకు కారణమవుతున్నాయి. ఇలా సంగీత విజయ్ ఫంక్షన్లు అన్నిటికీ దూరంగా ఉండడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుకే విడాకుల వరకు వెళ్లారనీ వార్తలు పుట్టుకొచ్చాయి.

Vijay Thalapathy: విజయ్ దంపతుల మధ్య ఎలాంటి మనస్పర్తలు లేవు…
విజయ్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై విజయ్ సన్నిహితులు స్పందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయ్ భార్య ప్రస్తుతం తన పిల్లలతో కలిసి అమెరికా వెళ్లారు. అందుకే తను ఏ కార్యక్రమాలకు హాజరు కాలేకపోతున్నారు. త్వరలోనే ఆమె తిరిగి ఇండియాకి రానున్నారు. ఇక వారిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని వారిద్దరు చాలా సంతోషంగా ఉన్నారంటూ విడాకుల వార్తలను విజయ్ సన్నిహితులు కొట్టి పారేశారు.





























