Vijaya Shanthi : సినిమాల్లో అగ్ర హీరోయిన్ గా అందరు హీరోలతో నటించి లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయ శాంతి సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోను తనకంటూ మంచి గుర్తింపు అందుకుంది. తెలంగాణ సెపరేట్ రాష్ట్రంగా అవతరించాలన్న ఆశయంతో తల్లి తెలంగాణ పార్టీ పెట్టి పోరాడారు. రాజకీయ ఓనమాలు బీజేపీ లో నేర్చుకున్నా ఆపైన సొంత పార్టీ పెట్టి పరిస్థుల ప్రభావం వల్ల పార్టీని తెరాసలో విలీనం చేసి అటు మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్లి చివరకు బీజేపీలో కొనసాగుతున్న రాములమ్మ తన రాజకీయ ప్రస్థానం గురించి ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

కేటీఆర్ కి ప్రచారం చేసి గెలిపించాను…
1998 లో రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి మొదట బీజేపీ లో చేరి తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాడారు. ఆ పైన తెలంగాణ గురించి మాట్లాడకూడదని అప్పటి బీజేపీ మిత్ర పక్షాల నుండి ఒత్తిడి రావడం వల్ల విజయశాంతి పార్టీ నుండి బయటకు వచ్చి 2005 లో తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. ఇక మారిన పరిస్థితుల్లో తెరాసలో పార్టీని విలీనం చేసాక కెసిఆర్ ఎలాంటి మోసగాడో అర్థమైందని నాకు రాజకీయ భవిష్యత్తు ఉండకూడదని చాలా ప్రయత్నించాడు అంటూ చెప్పారు.

మెదక్ ఎంపీ సీట్ నాకు ఇస్తానని చెప్పి తానే మళ్ళీ నామినేషన్ వేసాడు. మళ్ళీ నేను ఇండిపెండెంట్ గా వేయడంతో తాను విత్డ్రా చేసుకుని నాకు ఇచ్చాడు పార్టీ నుండి సీట్ అంటూ చెప్పారు. తన కొడుకు కేటీఆర్ మొదటి సారి గెలవడానికి నేనే కస్టపడ్డాను అంటూ చెప్పారు రాములమ్మ. నేను ఓడిపోవాలని కెసిఆర్ చాలా ప్రయత్నించారు అంటూ చెబుతూ కేటీఆర్ ప్రచారానికి వెళ్లిన చోట రాళ్ళ దెబ్బలు తినడంతో కెసిఆర్ నన్ను ఆ మండలాల్లో ప్రచారం చేయమన్నాడు. అంతవరకు రాళ్ళతో కొట్టినవాళ్లు రాములమ్మ రాగానే పూలను వేశారు. కేటీఆర్ అదేంటి మేడం నన్ను ప్రచారానికి వస్తే రాళ్లతో కొట్టారు మీరు రాగానే సీన్ మారిపోయింది అంటూ ఆశ్చర్య పోయాడు అంటూ తెలిపారు. తన ఎన్నికల ప్రచారాన్నీ పక్కన బెట్టి కేటీఆర్ కోసం వెళ్లానని, చాలా మండలాల్లో అసలు ప్రచారం చెయలేదని అయినా తెలంగాణ ప్రజలు గెలిపించారంటూ చెప్పారు విజయశాంతి.