Vijayashanti : ఒకప్పటి పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడీ జీవితాన్ని ఆదర్శంగా చేసుకొని ఒక కథ తయారు చేయమని ఎ.ఏం.రత్నం, పరుచూరి సోదరులతో చెప్పారు. ఆ క్రమంలో.. పరుచూరి సోదరులు అద్భుతమైన పవర్ ఫుల్ పోలీస్ స్టోరీని రాయడం జరిగింది. ఆ స్టోరీ ఏ.ఎం.రత్నం, మోహన్ గాంధీలకు నచ్చడంతో విజయశాంతితో సినిమా తీయడానికి సంసిద్ధులు అయ్యారు. ఇక విజయశాంతికి దీటుగా సరికొత్త విలనిజాన్ని పండించడానికి కొత్త వారిచే విలన్ పాత్ర చేయించాలనే ఉద్దేశంతో… ప్రముఖ నిర్మాత పుండరీకాక్షయ్యను కర్తవ్యం చిత్రంలో విలన్ గా తీసుకున్నారు. అలా 1990,జూన్ లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది.

ఆ తర్వాత 1991, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణం, విజయబాపినీడు దర్శకత్వంలో “గ్యాంగ్ లీడర్” చిత్రం పాట “భద్రాచలం కొండా సీతమ్మ వారి అండ.. కావాలా నీకు అండా దండా” అనే పాట చిత్రీకరణ జరుగుతున్న సందర్భంలో కర్తవ్యం సినిమాకి జాతీయ ఉత్తమ నటిగా విజయశాంతికి అవార్డు ప్రకటించారు. గ్యాంగ్ లీడర్ సినిమా యూనిట్ సభ్యులు మొత్తం ఆమెను అభినందించారు. అయితే గ్యాంగ్ లీడర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డిఫరెంటు లుక్ అండ్ మేనరిజం డైలాగ్, సూపర్ సాంగ్స్ అండ్ డాన్స్, వెరైటీ కాస్ట్యూమ్స్ తో యూత్ మొత్తాన్ని తన సినిమా వైపు చిరంజీవి తిప్పుకున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి అన్నీ తానై ఈ సినిమా అద్భుత విజయానికి కారకులయ్యారు. అయితే గ్యాంగ్ లీడర్ సినిమా పోస్టర్స్ పైన చిరంజీవి మాస్ లుక్ తో అభిమానులను ఆకట్టుకున్నారు. అలాగే కర్తవ్యం సినిమాతో హీరోలతో సమానంగా ఇమేజ్ వచ్చినా కూడా ఈ సినిమాలో సరైన గుర్తింపు రాలేదని ఆమె అనుకున్నారని వినికిడి.అయితే మూవీ పోస్టర్స్ పైన విజయశాంతి ఫోటో లేదని “గ్యాంగ్ లీడర్” శతదినోత్సవానికి విజయశాంతి హాజరు కాలేదని అప్పట్లో ఇండస్ట్రీలో ఒక టాక్ కూడా వినిపించింది.

కర్తవ్యం సినిమా తర్వాత సరిగ్గా మూడు సంవత్సరాలకు (1993) బాలయ్యతో విజయశాంతి జోడీగా నటించారు. యువరత్న ఆర్ట్స్, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నిప్పురవ్వ చిత్రం షూటింగ్ మొదలైంది. మొదట రాసుకున్న స్క్రిప్టులో హీరోయిన్ పాటలకు మాత్రమే పరిమితం కాకుండా.. హీరో బాలకృష్ణతో సరిసమానంగా తన పాత్రను మరింత పొడిగించాలని తరుచూ విజయశాంతి అడుగుతూ ఉండేవారు. అలా చేయడంతో బాలయ్య, విజయశాంతి మధ్య దూరం ఏర్పడింది. ఎప్పుడైతే ఈ సినిమాలో బాలకృష్ణ పార్ట్ అయిపోయిందో ఇక “నిప్పురవ్వ’ సినిమా గురించి ఆయన పట్టించుకోలేదు. సినిమా ప్రమోషన్స్ కి బాలయ్య హాజరు కాలేకపోయారు.

విజయశాంతి బాలయ్య మధ్య సఖ్యత ఉంటే మొదట ప్రకటించిన విడుదల తేదీకి సినిమా రిలీజ్ చేసి అద్భుత విజయాన్ని సాధించడానికి అవకాశం ఉండేది. కానీ నిప్పురవ్వ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన.. తరుచూ వాయిదా వేయడంతో సినిమా షూటింగ్ మూడు సంవత్సరాలు జాప్యం జరిగి 1993, సెప్టెంబర్ లో “నిప్పురవ్వ” చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరాజయం పొందింది. అయితే కర్తవ్యం సినిమా అనంతరం విజయశాంతి అనేక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో హీరోలతో సమానంగా బాక్సాఫీస్ వద్ద పోటీలో నిలిచినప్పటికీ ఆ సినిమాలు అంతగా విజయం సాధించలేకపోయాయి.































