Vijayendra Prasad:టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయేంద్ర ప్రసాద్ గురించి అందరికీ సుపరిచితమే. ఈయన ఎన్నో అద్భుతమైన తెలుగు సినిమాలకు కథలను అందించడమే కాకుండా బాలీవుడ్ సినిమాకి కూడా కథా రచయితగా పనిచేశారు. ఇలా ఇండస్ట్రీలో రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన రాజ్యసభ సభ్యునిగా కూడా పదవి దక్కించుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా గోవాలో జరుగుతున్నటువంటి 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా విజయేంద్ర ప్రసాద్ రైటింగ్ విభాగానికి చెందిన విషయాల గురించి క్లాసెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
మనం మన చుట్టూ జరుగుతున్న విషయాల నుంచి ఏదైనా ఒక కొత్తదనాన్ని వెలికి తీసి వాటిని ఆవిష్కరించడమే రచయిత ముఖ్య లక్షణం అంటూ ఈయన వెల్లడించారు.ఒక రచయిత కథ సిద్ధం చేస్తే అది దర్శక నిర్మాతలతో పాటు ప్రేక్షకులు కూడా ఆదరించే లాగా ఉండాలి.ఈ విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నామని ఒక అబద్ధాన్ని అందంగా తయారు చేసి చూపించడమే రచయిత లక్షణం అంటూ తెలిపారు.
అబద్ధాలు చెప్పే వారే స్టోరీ రైటర్స్…
మన చుట్టూ మన నిజజీవితంలోనే ఎన్నో కథలు ఉన్నాయి. నేను వీటి ఆధారంగా కథను దొంగలిస్తాను అంటూ ఈయన షాకింగ్ విషయాలు బయట పెట్టారు. మన చుట్టూ రామాయణం మహాభారతం వంటి ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయి. వాటి నుంచి కథలు తీసుకొని వాటిని అందరూ ఇష్టపడే విధంగా మలుచుకుంటానని తెలిపారు.ఇక అబద్ధాలు ఎక్కువగా చెప్పే వారే మంచి స్టోరీ రైటర్స్ అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…