Villain Vijaya Rangaraju : ఆంధ్రప్రదేశ్ కి చెందిన విలన్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన విజయ రంగరాజు పలుభాషల్లో నటించినా తెలుగులో యజ్ఞం సినిమాతో మంచి పేరు వచ్చింది. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపు తోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అలాగే విలన్ గాను మంచి సినిమా అవకాశాలు అందుకున్నారు. అయితే ఆయన తండ్రి ఆర్మీ ఆఫీసర్ అవడం వల్ల పూణే లో పుట్టి అక్కడ పెరిగారు. అయితే రాయలసీమ లోని గుంతకల్లులో చదువు పూర్తి చేసారు. ఇక నాటకాలు, సినిమాలు అంటే పిచ్చి ఉండటం వల్ల వాటి మీద ఫోకస్ చేసారు. చెన్నై వెళ్లి దాదాపు 100 నాటకాలలో వేసారు. ఇక సినిమాల్లో ఎన్టీఆర్ గారంటే చాలా ఇష్టమంటూ చెప్పే రంగరాజు గారు తన కెరీర్ అలాగే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.

రాజమౌళి నన్ను రిజెక్ట్ చేసారు…
యజ్ఞం సినిమా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిందని చెప్పే విజయరంగరాజు ఆ తరువాత చిన్న చిన్న సినిమాలల్లో చాలా వాటిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను విలన్ గాను నటించారు. అయితే పెద్ధ బ్యానర్స్ లో పెద్ధ డైరెక్టర్స్ తో నటించే అవకాశం రాలేదని బోయపాటి సినిమా అఖండలో అవకాశం వచ్చిన చివర్లో చేజారిందని చెప్పారు. ఇక రాజమౌళి గారి సినిమాలో అవకాశం కోసం ప్రయత్నించగా ఆ సినిమా. అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరిని కలిసి రాజమౌళి గారిని కలుద్దామని వెళితే ఆయన బిజీగా ఉన్నారు.

ఇక ఫొటోస్ ఇచ్చి వెళ్ళమని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పడంతో యజ్ఞం సినిమా స్టిల్స్ ఇచ్చాను. అవి చూసి రాజమౌళి గారు ఓల్డ్ గా ఉన్నాడు ఛత్రపతి లాంటి సినిమాలో ఫైట్స్ ఏం చేస్తాడు వద్దు అన్నారట. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను కలిసి ఈ ఫోటోలు ఇంకా ఎన్ని ఉన్నాయి అని అడిగి వాటిని కాల్చేయండి ముందు అని సలహా ఇచ్చాడట. ఇక రాజీవ్ కనకాల రికమెండేషన్ తో విశాఖ ఎక్ష్ప్రెస్స్ సినిమాలో విలన్ గా చేయగా ఆ సినిమా ప్రమోషన్స్ కి రాజమౌళి వచ్చారు అపుడు మీడియా ముందు ఆయన నన్ను రిజెక్ట్ చేసిన సంఘటన చెప్పగా ఆయన సారీ చెప్పారు అంటూ రంగరాజు తెలిపారు.