సాధారణంగా WWF లేదా WWE వంటి కుస్తీ పోటీలు ఏ స్థాయిలో ఉంటాయో మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ పోటీలలో పాల్గొనే వారు కేవలం రింగులో మాత్రమే కాకుండా బయట కూడా తమ బలాన్ని ప్రదర్శిస్తారు. ఈ విధంగా ఒకరిపై ఒకరు బలాన్ని ప్రయోగిస్తూ ఆటను మరింత రంజుగా మారుస్తారు. ఈ పోటీలలో పాల్గొనే అభ్యర్థులు ఎంత పని చేయడానికైనా ఏమాత్రం వెనుకాడరు. ప్రస్తుతం ఇలాంటి పోటీలలో జరిగిన ఓ వింత ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ కుస్తీ పోటీలో పాల్గొన్న ఇద్దరు ఫైటర్ల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ఇద్దరు ఒకరికి మించి ఒకరు పోటీ పడుతున్నారు. ఈ సందర్భంలోనే ఓ పోటీదారుడు తన ప్రత్యర్థి రెండు కాళ్ల మధ్య ఉన్న జననాంగాలను టార్గెట్ చేశాడు. ఈ క్రమంలోనే అతని ప్రత్యర్థి జననాంగాలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా సదరు పోటీదారుడు తన జననాంగాలపై పెట్రోలు పోసి నిప్పంటించగానే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ మంటలు మరి కాస్త పెద్దగా అతని ప్యాంటు మొత్తం వ్యాపించడంతో బాధితుడు విలవిలలాడి పోయాడు.ఈ క్రమంలోనే అతడు అక్కడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి కోసం పరుగులు పెట్టగా అక్కడున్న వారు మంటలను అదుపు చేసి అతనిని రక్షించారు.
ఈ విధంగా మంటలు అదుపు కావడంతో కేవలం చిన్న గాయాలతో అతడు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.




























