దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపధ్యంలో ఈ కష్టకాలంలో పోరాడుతున్న వారిని ఆదుకునేందుకు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఒక విడియో రిలీజ్ చేసారు.

ప్రస్తుత పరిస్తుతుల్లో దేశంలోని ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని విరాట్ కోహ్లి అన్నారు. అందువల్ల కరోనపై తానూ, అనుష్క శర్మ ఇద్దరం కలిసి ఉద్యమం చేపట్టనున్నట్టు తెలిపాడు. ఈ కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలవాలని కోహ్లి అన్నాడు.
అందుకోసం కేట్టో అనే వెబ్ సైట్ ద్వారా విరాళాలు సేకరణ చేయనున్నట్టు తెలిపాడు. మొదటగా తాము 2 కోట్లు ఇవ్వనున్నాట్లు తెలిపిన కోహ్లీ ప్రస్తుతం దేశ ఆరోగ్య వ్యవస్థ పెను సవాళ్ళను ఎదుర్కొంటుందని అన్నారు.



























