Virender Sehwag: భారత జట్టు గర్వించదగ్గ ఓపెనర్ల లో ఒకరైనటువంటి వీరేంద్ర సెహ్వాగ్ తన అద్భుతమైన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈయన బ్యాట్ చేత పెట్టారంటే బాల్ బౌండరీ దాటాల్సిందే. ఎలాంటి బౌలర్ అయినా సరే ఈయనకు బౌలింగ్ చేయాలంటే కాస్త భయపడే వారు. సెహ్వాగ్ బ్యాటింగ్ వన్డే అయినా టెస్ట్ అయినా ఒకే రీతిలో ఉంటుంది.

తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ ఒక స్పోర్ట్స్ ఛానల్ తో ముచ్చటిస్తూ గతంలో తనకు జరిగిన ఒక చేదు సంఘటన గురించి తెలియజేశారు. ఈ క్రమంలోనే మహేంద్రసింగ్ ధోని పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2008 ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం వెళ్ళినప్పుడు తను తన ఫామ్ కోల్పోయాను. నాలుగు వన్డేల్లోనూ చాలా తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యారని తెలియజేశారు.

ఆ సమయంలో వీరేంద్ర సెహ్వాగ్ ఆటతీరుపై ఎంతో మంది అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేశారు. ఈ విధంగా నాలుగు వన్డేల్లోనూ సెహ్వాగ్ తక్కువ పరుగులకే అవుట్ అవ్వడంతో మహేంద్రసింగ్ ధోని కావాలనే నన్ను తుది జట్టునుంచి తప్పించాడు. ఆ సమయంలో మానసికంగా ఎంతో కృంగి పోయానని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఆ రోజు సచిన్ లేకపోతే అదే జరిగేది…
ఆ సమయంలో వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చి కేవలం టెస్టులు మాత్రమే ఆడాలని ఫిక్స్ అయ్యాను అయితే సచిన్ టెండూల్కర్ చెప్పగా ఆయన ఇది నీ కెరీర్లో ఎంతో కఠినమైన దశ కొద్ది రోజులు ఓపిక పట్టు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత రిటైర్మెంట్ చేయాలా వద్దా అని ఆలోచించుకో అని చెప్పారు.ఆయన చెప్పిన విధంగానే కొన్ని రోజులపాటు ఓపికతో వేచి చూశాను అదృష్టవశాత్తు తిరిగి ఫామ్ లోకి వచ్చానని ఈ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ గతంలో తనకు జరిగిన ఈ చేదు సంఘటన గురించి తెలియజేశారు.
“I wanted to retire from ODIs after Dhoni dropped me but Tendulkar stopped me at that time. He said ‘this is a bad phase of your life. Just wait, go back home after this tour, think hard, then decide what to do next’. Luckily I didn’t announce my retirement at that time."
— Cricketopia (@CricketopiaCom) June 1, 2022
Sehwag pic.twitter.com/Mn8EwD06ge
































