Vizag Harika : నా బిడ్డకు తండ్రి ఎవరో కూడా తెలియదు… పెళ్ళైన మూడు నెలలకే వేధింపులు… తమ్ముడితో మాట్లాడినా అనుమానమే…: వైజాగ్ హారిక

0
986

Vizag Harika : ఒక ఆడపిల్లను బాగా స్థిరపడిన కుటుంబానికి ఇస్తే సుఖపడుతుందని ఎంతో మంది మధ్య తరగతి వారు అప్పు చేసైనా సరే కూతుర్లకు పెళ్లి చేస్తారు. అయితే పెళ్లి చేసాక అన్నీ బాగుంటే అంతా ఆనందమే కానీ పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో వచ్చిన అమ్మాయికి కట్నం కోసం అంటూ నీకంటే గొప్పగా సంబంధం వచ్చేది అంటూ వేదిస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది. ఒకవైపు కష్టపడి పెళ్లి చేసిన తల్లిదండ్రులకు చెప్పి బాధపెట్టలేక మరోవైపు అత్తింట్లో నరకం చూస్తూ క్రుంగిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలా భర్త ఇంటివాళ్ళు పెట్టిన హింస భరిస్తూనే ఉన్నా ఆడపిల్ల పుట్టిందని ఆమెను దూరం పెట్టడంతో ఏమీ చేయలేక మీడియా ముందుకు వచ్చింది హారిక.

పాపకు తండ్రి ఎవరో తెలియదు…

హారిక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు. తండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో చిరు ఉద్యోగి కాగా అప్పు చేసి కూతురు పెళ్లి ఐటీపీబి లో హెడ్ కాన్స్టేబుల్ గా పనిచేస్తున్న శ్రవణ్ కుమార్ కి ఇచ్చి పెళ్లి చేసారు. పది లక్షల దాకా నగదు కట్నం రూపంలో అలాగే బంగారం, వెండితో పాటు సారె ఇచ్చి పెళ్లి చేసారు. అయితే పెళ్లి జరిగి అత్తరింటికి వెళ్లిన హారిక కు మొదటి వారం నుండే భర్త నుండి ఛీత్కారాలు మొదలయ్యాయి. నీకంటే ఎక్కువ కట్నం ఇచ్చే సంబంధం చేసుకునేవాడిని అంటూ మొదలు పెట్టారట. ఇక 2016 లో పెళ్లి జరుగగా అప్పటి నుండి వేధింపులు, కొట్టడం వంటివి జరుగుతున్నా పుట్టింట్లో చెప్పలేదట. అయితే ఒకసారి బాగా అనారోగ్యాంగా ఉండటం వల్ల పుట్టింట్లో హారిక ను వదిలి ట్రైనింగ్ కు వెళ్తున్నట్లు చెప్పారట ఆమె భర్త. అపుడే ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసీ విషయం అత్తింట్లో చెప్పినా పెద్దగా స్పందించలేదట.

ఇక పాప పుట్టేసరికి మాట్లాడటం మానేశారట. అలా 2020లో మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా మూడు సార్లు కౌన్సెలింగ్ కి పిలవగా ఒక్కసారిగా కూడా ఆమె భర్త హాజరు కాలేదు. ఉద్యోగంలో సెలవు దొరకలేదు అనే సాకు చెప్పి హారిక అత్తగారే హాజరయ్యారు. ఇక ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారట. అయితే పాపకు ఇప్పుడు 5 ఏళ్ళు కాగా తండ్రి ఎవరు అన్నది కూడా తెలియదని హారిక ఎమోషనల్ అయ్యారు. ఇక ఆమె తోడి కోడలు పరిస్థితి కూడా ఇలాగే ఉందని తనకు పుట్టిన పాప దివ్యంగురాలు కావడం వల్ల ఇంట్లో నుండి గెంటేసారని తెలిపారు.