VJ Sunny : నా గురించి తెలియక పోలీసు లాఠితో కొట్టారు… ఆ రోజు కారు డామేజికి 6 లక్షలు ఖర్చు…: విజే సన్నీ

0
150

VJ Sunny : జర్నలిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆపైన వీడియో జాకీగా అలాగే సీరియల్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న విజే సన్నీ ఆపైన బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలిచిన సన్నీ కి ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది. అప్పటికే సకల గుణాభి రామ అనే సినిమా చేసినా అది ఎపుడు వచ్చిందో ఎపుడు వెళ్లిందో ఎవరికీ తెలియదు. అయితే ప్రస్తుతం మాత్రం వరుసగా సినిమా ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు విజే సన్నీ. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న సన్నీ తాజాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘అన్ స్టాపబుల్’ సినిమా విశేషాలని ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

పోలీస్ కొట్టాడు… డామేజ్ కి 6 లక్షలు ఖర్చు…

బిగ్ బాస్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న సన్నీ బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా గెలిచాక జరిగిన సంఘటనలను సన్నీ రీసెంట్ గా ఇంటర్వ్యూలో వివరించారు. బిగ్ బాస్ లో ఉన్నపుడు తనకు అసలు ఏమాత్రం బయట అంతమంది ఫ్యాన్స్ ఉంటారని అనుకోలేదని విన్ అయ్యాక బయటికి వస్తే చూడటానికి అంతమంది అభిమానులు వస్తారని ఊహించలేదు. నా ఫ్రెండ్స్ హమ్మర్ కారు వేసుకుని నాకోసం వచ్చారు.

నేను ఏం జరుగుతోంది బయట అని అడిగితే నువ్వు కళ్ళు మూసుకుని కారులో కూర్చో బయట చూడు ఎలా ఉందో అని చెప్పారు. కారులో నేను కూర్చోగా నా స్నేహితులు మరికొంతమంది మరో కారులో రాగా ఒకడు నిలబడుకుని కారులో వచ్చాడు. నేనసలు ఎవరో తెలియని పోలీస్ నా స్నేహితుడిని కొట్టాడు. అక్కడ ఉన్న ఆఫీసర్ కి నేనెవరో తెలియదు. ట్రాఫిక్ జామ్ అవ్వుతుందని భయపడ్డారు అందుకే అలా పోలీస్ కొట్టాల్సి వచ్చింది. ఇక అందరినీ పలకరించే వెళ్లాలని స్లోగా వెళ్ళడం వల్ల ఇకా అందరూ కారు మీదికి ఎక్కి తొక్కడం వల్ల కారుకి దాదాపు 6 లక్షలు ఖర్చు అయింది అంటూ చెప్పారు సన్నీ.