ఎన్నో బుల్లితెర సీరియల్స్ లో హీరోగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు కృష్ణ కౌశిక్ తెలియని వారు ఎవరూ ఉండరు. ఈయన కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాల్లో సందడి చేశారు. అలాగే తాజాగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందారు. అయితే తన ప్యానల్ సభ్యులతో పాటు కౌశిక్ కూడా రాజీనామా చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా కృష్ణ కౌశిక్ యూట్యూబ్ ఇంటర్వ్యూస్ లో పాల్గొంటూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే గతంలో కృష్ణ కౌశిక్ టీవీ ఆర్టిస్టుల సమస్యలపై పోరాడటంతో అతనిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలోని ఆయన ఆ జైలు అనుభవాల గురించి ముచ్చటించారు.
ఈ సందర్భంగా కౌశిక్ మాట్లాడుతూ నేను చంచల్ గూడ జైలులో అనుభవించిన జీవితాన్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని తెలియజేశారు. జైలులోకి వెళ్ళగానే రిజిస్టర్ లో సంతకం చేయించుకొని తన ఒంటిపై ఉన్న దుస్తులను తీయించి తనని మొత్తం చెక్ చేశారని ఆ సంఘటనలను తాను ఎప్పటికీ మర్చిపోను అని కౌశిక్ ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ క్రమంలోనే కౌశిక్ మాట్లాడుతూ తాను చంచల్ గూడ జైలులో ఉన్న సమయంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే జైల్లో ఉన్నారని తెలిపారు. అయితే తాను ఎప్పుడూ కూడా అతనిని కలవలేదని జగన్ మోహన్ రెడ్డి గారు
వీఐపీ బరాక్‌లో ఉంటే తాను జనరల్ బరాక్‌లో ఉండేవాడినని అందువల్ల తనని కలవలేకపోయానని ఈ సందర్భంగా కృష్ణ కౌశిక్ వెల్లడించారు.





























