సినీనటి హీరోయిన్ జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు కానీ ఒకప్పడు హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు.అప్పట్లో జయప్రద శ్రీదేవి లాంటి హీరోయిన్లకు ధీటుగా నిలిచారు. అంతేకాకుండా గ్లామర్ విషయంలో కూడా ఆ ఇద్దరు హీరోయిన్ కి ఏ మాత్రం తగ్గకుండా అదే రీతిలో సినిమాలు కొనసాగించేవారు. అంతేకాకుండా లెజెండరీ డైరెక్టర్ సత్యజిత్ రే లాంటి వారు ఇవాళ దేశం మొత్తం మీద జయప్రద లాంటి అందమైన తార ఇంకొకరు లేరు అనేశారు.

కానీ శ్రీదేవి మాత్రం కోట్లాది మంది ప్రేక్షకులకు కలలరాణి గా పేరు తెచ్చుకుంది. అలాంటి టాప్ టాప్ హీరోయిన్ లతో పాటుగా నటించింది. ఇది ఇలా ఉంటే తెలుగు సినీ పరిశ్రమలో మహానటి అనే గొప్ప మాటకు సావిత్రి అన్న పేరు మాత్రమే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కానీ సావిత్రి తర్వాత ఎంతోమంది నటీమణులు గొప్ప గొప్ప సినిమాలు పాత్రలు చేశారని కానీ వారికి అలాంటి గుర్తింపు రాలేదని బాధపడతారు.
ఇటీవలే ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సావిత్రి గారి తర్వాత అంత గొప్ప సినిమాలు వాణిశ్రీ చేశారు. కానీ ఎంతమంది వాణిశ్రీ గురించి చెబుతారు. అలాగే శారద గారు సెకండ్ ఇన్నింగ్స్ హీరోయిన్ గానే కాకుండా మదర్, పోలీస్ ఆఫీసర్ లాంటి పవర్ ఫుల్ పాత్రలో కూడా నటించారు. పరుచూరిబ్రదర్స్ ఆమెకు అలాంటి పాత్రను సృష్టించారు.
ఉమెన్ ఇన్ తెలుగు అన్ని సినిమా తీసుకుంటే సావిత్రి తర్వాత ఇంకా ఎవరి గురించి మాట్లాడటం లేదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అదేవిధంగా సావిత్రి తర్వాత అంతకంటే మంచి సినిమాల్లో నటించిన వారికి కూడా గౌరవం దక్కాలి కదా! వాణిశ్రీ శారద తర్వాత సీరియస్ రోల్స్ చేయడానికి నేను వచ్చాను పెద్ద హీరోలతో చేసే చిన్న చిన్న హీరోలతో ఎందుకు చేస్తావ్ అని నన్ను అన్న వారు కూడా ఉన్నారు. కానీ కేవలం పాత్రలు నచ్చినవి మాత్రమే నేను చేస్తాను అని ఆమె చెప్పుకొచ్చారు.































