టెంపర్ సినిమాలో ఆ పాత్ర నారాయణమూర్తి ఎందుకు చేయన్నన్నారో తెలుసా.?!

0
1815

రామయ్య వస్తావయ్య, రభస చిత్రాల ఫెయిల్యూర్స్ తో సందిగ్ధంలో పడ్డ జూనియర్ ఎన్టీఆర్ కి అర్జెంటుగా ఒక బ్లాక్ బస్టర్ సినిమా కావాలి అనిపించింది. ఎప్పుడూ సొంత కథలతో సినిమాలు తీసే పూరి జగన్నాథ్ కి వక్కంతం వంశీ చెప్పిన డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ నచ్చడంతో బండ్ల గణేష్ నిర్మాతగా టెంపర్ అనే సినిమాను రూపొందించడం జరిగింది.

అయితే కథా రచయిత వక్కంతం వంశీ మొదటగా ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన కలుసుకోవాలని చిత్రానికి కథ అందించడం జరిగింది.కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. తర్వాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అశోక్ చిత్రానికి కథ రాస్తే ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మహేష్ బాబు తో వచ్చిన అతిథి సినిమా కూడా అపజయాన్ని చవిచూసింది.

తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన కిక్ మూవీ సూపర్ హిట్ అయింది. అప్పుడు వక్కంతం వంశీకి చాలా రోజుల తర్వాత రచయితగా గా ఒక హిట్ రావడం ఆయన కెరీర్ కి బూస్టింగ్ లాంటిదిగా పేర్కొనవచ్చు. ఆ తర్వాత వచ్చిన ఊసరవెల్లి యావరేజ్ గా నిలువగా ఎవడు సినిమా సూపర్ హిట్ అయింది.ఆ తర్వాత ఈయన కలం లోంచి వచ్చిన రేసుగుర్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అయితే ఈ సినిమా తర్వాత వక్కంతం వంశీ కథ అందించిన చిత్రం టెంపర్.ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి వేసిన కానిస్టేబుల్ పాత్రను మొదటగా ఆర్.నారాయణమూర్తి ని అడుగగా తాను ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే పైకి వచ్చానని కానీ ఇప్పుడు మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయనని తనను ఓ ప్రధాన పాత్రలో ఏ.ఎన్నార్ వేసిన మూగ మనసులు, సోమయాజులు వేసిన శంకరాభరణం లాంటి సినిమాలు ఏవైనా తాను నటించడానికి ఎప్పుడూ సిద్ధమేనని వినమ్రంగా ఆ ఆఫర్ని తిరస్కరించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here