AP politics: లోకేష్ పవన్ కు పోటీగా మహిళ అభ్యర్థులు.. మహిళలను రంగంలోకి దింపిన జగన్?

AP politics: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినటువంటి తరుణంలో అన్ని పార్టీ నేతలు అభ్యర్థుల జాబితాను తెలియజేశారు. ఈ క్రమంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికలలో అందరీ చూపు రెండు నియోజక వర్గాల పైనే ఉంది.

ఒకటి పిఠాపురం కాగా మరొకటి మంగళగిరి. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు కానీ ఈసారి గెలవాలనే ఉద్దేశంతో ఈయన పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కి పోటీగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వంగా గీతా రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి ఈమె ఈసారి ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు.

ఇక మంగళగిరిలో గత ఎన్నికలలో నారా లోకేష్ పోటీ చేసే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో ఈయన మరో నియోజకవర్గానికి వెళ్లకుండా ఈ ఎన్నికలలో కూడా అక్కడే విజయం సాధించాలన్న ధీమాతో మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక మంగళగిరి నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఈసారి ముడుగూరు లావణ్య అనే మహిళను జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దింపారు.

పోటీగా మహిళా అభ్యర్థులు..
ఇక వీరిద్దరికీ మాత్రమే కాకుండా బాలయ్యకు పోటీగా కూడా మహిళా అభ్యర్థిని నిలబెట్టడం గమనార్హం హిందూపురం నుంచి బాలయ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి దీపిక రంగంలోకి దిగారు. ఇలా ఈ ముగ్గురికి పోటీగా జగన్మోహన్ రెడ్డి మహిళా అభ్యర్థులను నియమించి భారీ ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఈ ఎన్నికలలో ఈ ముగ్గురు గెలిస్తే పర్వాలేదు కానీ లేకుంటే మహిళల చేతిలో ఓడిపోయారనే ఆపవాదం మూట కట్టుకోవాల్సి వస్తుందని చెప్పాలి.