సాధారణంగా ఒక కాన్పులో ఒకరు పుట్టడం సర్వసాధారణం. అదే ఒకే కాన్పులో కవలలు ఉండి వారికి జన్మనివ్వాలంటే అది సాహసంతో కూడుకున్న పని అని చెప్పవచ్చు. కడుపులో ఇద్దరు పిల్లలు పెరుగుతుంటే తల్లి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.తరచూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ ఆహార విషయాలలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తుంటారు. కవలలకే ఇన్ని జాగ్రత్తలు పాటిస్తే మరి ఏకంగా ఓ మహిళ ఓకే ప్రసవంలో పది మంది పిల్లలను కని అందరిని ఆశ్చర్య పరిచింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ నెలకొల్పని రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన మహిళ సొంతం చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

దక్షిణాఫ్రికాకు చెందిన 37 ఏళ్ల గోసియామ్ తమరా సిథోల్ అనే మహిళ మే 7వ తేదీ సోమవారం ఆమె ప్రిటోరియా హాస్పిటల్‌లో పది మంది పిల్లలకు జన్మనిచ్చింది.ప్రసవ సమయంలో ఆమె సాధారణ ప్రసవం అవ్వడానికి కష్టం కావడంతో డాక్టర్లు సిజేరియన్ ద్వారా పిల్లలను బయటకు తీసినట్లు తెలిపారు.ఈ క్రమంలోనే ఏడుగురు మగ పిల్లలు ముగ్గురు ఆడ పిల్లలకు సదరు మహిళా జన్మనిచ్చింది.ప్రస్తుతం వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలియజేశారు.
ఇది వరకే సిథోల్ కి తొలి కాన్పులో కవలలు జన్మించగా రెండవ కాన్పులో ఏకంగా పది మంది జన్మించారు.ప్రసవానికి ముందు వైద్యులు నిర్వహించిన పరీక్షలో ఆమె గతంలో కేవలం ఆరుగురు మాత్రమే పెరుగుతున్నట్లు వైద్యులు తెలిపారు. కానీ ప్రసవం తర్వాత ఆమె 10 మంది పిల్లలకు జన్మనివ్వడంతో ఎంతో ఆశ్చర్యపోయారు.ఈ క్రమంలోనే సదరు మహిళ మాట్లాడుతూ ఒకేసారి పది మంది పిల్లలకు జన్మనివ్వడం అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని అని. గర్భం ధరించినప్పుడు తన కాళ్ళు విపరీతంగా నొప్పిని కలిగించేవని తెలిపారు. ఒకేసారి గర్భంలో అంతమంది ఉండటం వల్ల ప్రాణాలతో ఉండరేమోనని భావించామని తెలిపారు.
ఈ విధంగా ఈ మహిళ ఒకే ప్రసవంలో 10 మంది పిల్లలకు జన్మనివ్వడంతో ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా 10 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళగా రికార్డు సొంతం చేసుకున్నారు.ఇప్పటి వరకు అత్యధిక పిల్లలను ప్రసవించిన రికార్డు హలీమా సిస్సే పేరు ఉండగా తాజాగా ఈమె పదిమందికి జన్మనిచ్చి ప్రపంచంలోనే అరుదైన రికార్డును నెలకొల్పారు.



























